Buzz: Is That Sree Leela Stepped Out From SSMB28? - Sakshi

Sree Leela : మహేశ్‌ బాబు సినిమా నుంచి తప్పుకున్న శ్రీలీల? కారణం ఇదే!

Jan 7 2023 2:10 PM | Updated on Jan 7 2023 3:10 PM

Buzz Is That Sree Leela Stepped Out From SSMB28 - Sakshi

సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా  SSMB28. హారికా హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్‌ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. ఈమెతో పాటు ధమాకా బ్యూటీ శ్రీలీల మరో హీరోయిన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పడు శ్రీలీల ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

గతంలో చేసుకున్న ఒప్పందాల కారణంగా డేట్స్‌ అడ్జస్ట్‌ చేయలేక ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. శ్రీలీల ఇంత పెద్ద ఆఫర్‌ను వదులుకోవడం ఆమె బ్యాడ్‌ లక్‌ అంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందన్నది తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడాల్సిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement