
సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అతడు, ఖలేజాల తర్వాత వీరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమిది. ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రూపొందే ఈ చిత్రాన్ని ఎస్‌ఎస్‌ఎంబీ28 (SSMB28) అనే వర్కింగ్ టైటిల్‌తో సెట్స్‌పైకి తీసుకురానున్నారు. మహేశ్-త్రివిక్రమ్‌లో కాంబినేషన్ అనగానే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
చదవండి: ‘విక్రమ్’ మేకింగ్ వీడియో చూశారా?.. డైరెక్టర్ ఫోకస్‌కు నెటిజన్లు ఫిదా!
దీంతో ఈ చిత్రం సెట్స్‌పైకి వచ్చేది ఎప్పుడెప్పుడా? అని ఫ్యాన్స్ ఆత్రుతుగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ అప్‌డేట్‌ను వదిలారు మేకర్స్. ‘ఎస్‌ఎస్‌ఎంబీ28 చిత్రం ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. అగస్ట్‌లో రెగ్యూలర్ షూటింగ్ జరగనుంది’ అని మేకర్స్ ట్విటర్ వేదికగా తెలిపారు. అలాగే వచ్చే ఏడాది సమ్మర్‌లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు కూడా ఈ సందర్భంగా ప్రకటించారు. ఇందులో మహేశ్‌కు జోడిగా పూజా హెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే. తమన్ సంగీతం అందిస్తున్నాడు.
చదవండి: Priya Anand: 'నిత్యానందస్వామిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా'
The Evergreen Combo of Super Star @urstrulyMahesh & our Darling Director #Trivikram is back to REIGN! 🔥
— Haarika & Hassine Creations (@haarikahassine) July 9, 2022
The most eagerly awaited #SSMB28 pre-production has started on EPIC proportions! Shoot starts This Aug✨
Be Ready for a MASSive Blast at the Screens ~ Summer 2023! pic.twitter.com/m4g6m3p9Ad
Comments
Please login to add a commentAdd a comment