Is Pooja Hegde Put Conditions For Mahesh Babu, Trivikram SSMB28 Movie - Sakshi
Sakshi News home page

Pooja Hegde: ‘ఏంటీ.. మహేశ్‌ సినిమాకు పూజా కండిషన్స్‌ పెట్టిందా?’

Published Fri, Jul 8 2022 3:44 PM | Last Updated on Fri, Jul 8 2022 4:32 PM

Is Pooja Hegde Put Conditions For Mahesh Babu, Trivikram SSMB28 Movie - Sakshi

ప్రస్తుతం పూజా హెగ్డే వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది. రాధేశ్యామ్‌, ఆచార్య, బీస్ట్‌ చిత్రాలతో వరుస ఫ్లాప్‌లు ఎదురయ్యాయి. అయినప్పటికీ ‘బుట్టబొమ్మ’ క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. తెలుగులో జనగనమణ, మహేశ్‌-తివిక్రమ్‌ మూవీ ‘ఎస్‌ఎస్‌ఎంబీ28’తో (#SSMB28) పాటు హిందీలో సర్కస్‌ రెండు సినిమాలకు సంతకం చేసింది. ఇప్పటికే సల్మాన్‌ ఖాన్‌ కభీ ఈథ్‌ కభీ దివాలీ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న పూజా త్వరలో సర్కస్‌ మూవీ షూటింగ్‌లో కూడా పాల్గొనుంది.

చదవండి: ఆరేళ్ల రిలేషన్‌.. కానీ అప్పుడే మా ప్రేమ బలపడింది: ఆలియా

మరోవైపు స్పెషల్‌ సాంగ్స్‌తో సైతం ఆమె బిజీ బిజీగా మారింది. ఈ క్రమంలో తివిక్రమ్‌-మహేశ్‌ సినిమా కూడా త్వరలో సెట్స్‌పైకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఆగస్ట్‌ మొదటి వారం నుంచే ఈ మూవీ రెగ్యులర్‌ షూటింగ్‌ను జరుపుకొనుందని సమాచారం. ఈ నేపథ్యంలో మహేశ్‌ సినిమాకు పూజా పలు కండిషన్స్‌ పెట్టినట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం పూజా కేవలం 45 రోజుల కాల్‌షీట్‌ మాత్రమే కేటాయించిన్నట్లు సమాచారం.

చదవండి: నటుడు ప్రభు ఇంట ఆస్తి వివాదం.. కోర్టును ఆశ్రయించిన తోబుట్టువులు

ప్రస్తుతం ఉన్న తన బిజీ షెడ్యూల్‌ కారణంగా.. ఇచ్చిన డేట్స్‌లోనే తనకు సంబంధించిన షూటింగ్‌ కంప్లీట్‌ చేయాలని మేకర్స్‌కు చెప్పిందట పూజా. ఇది తెలిసి సూపర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ పూజాపై కాస్తా అసహనం వ్యక్తం చేస్తున్నారు. మహేశ్‌ సినిమాకే ఆమె కండిషన్స్‌ పెట్టిందా? అంటూ ఆమెపై కొందురు ముక్కు విరిస్తున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు మహేశ్‌ సైతం ఈ సినిమాను వీలైనంత త్వరగా కంప్లీట్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నాడట. ఎందుకంటే జక్కన్నతో చేసే సినిమాను 2023లోనే సెట్స్‌పైకి తీసుకురావాల్సింది ఉందట. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement