
స్విట్జర్లాండ్‌లో వెకేషన్‌కు ప్యాకప్ చెప్పి ఇండియాలో ల్యాండ్ అయ్యారు మహేశ్‌బాబు. గత నెల మూడో వారంలో ఫ్యామిలీతో కలిసి మహేశ్ ఫారిన్ వెకేషన్‌కు వెళ్లారు. ముందు లండన్ వెళ్లి, ఆ తర్వాత స్విట్జర్లాండ్‌లో ఎక్కువ రోజులు గడిపారు. శుక్రవారం హైదరాబాద్ చేరుకున్నారు. ఇక మహేశ్‌బాబు నెక్ట్స్ ఫిల్మ్ త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం మహేశ్‌బాబు కొత్తగా మేకోవర్ అవుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
(చదవండి: ఒక్క ట్వీట్‌తో ఫ్యాన్స్‌కి షాకిచ్చిన రానా)
మహేశ్ గడ్డంతో ఉన్న లుక్స్ వైరల్ అవుతుండటంతో ఈ న్యూ మేకోవర్ ప్రచారానికి మరింత ఊతం లభించినట్లయింది. అలాగే ఈ సినిమాలోని క్యారెక్టర్ కోసం మహేశ్ కాస్త బరువు కూడా తగ్గుతున్నట్లుగా తెలిసింది. కాగా ఈ సినిమా షూటింగ్ ఈ నెలలోనే ఆరంభం కావాల్సింది. కానీ పరిశ్రమలోని సమస్యలను పరిష్కరించే దిశగా తెలుగు సినిమాల షూటింగ్స్‌ను తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే.
ఈ సమస్యలు ఓ కొలిక్కి వచ్చి, షూటింగ్‌ల బంద్‌కి ఫుల్‌స్టాప్ పడితే ఈ నెలలోనే ఈ సినిమా షూటింగ్ ఆరంభమయ్యే అవకాశం ఉంది. ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మించనున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించనున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత మహేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రానున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో అంచనాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment