
కన్నడ స్టార్ హీరోల్లో ఒకరైన ఉపేంద్ర మళ్లీ తెలుగు సినిమాలపై ఫోకస్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఆ మధ్య సన్నాఫ్ సత్యమూర్తి సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన ఉపేంద్ర మళ్లీ ఇన్నాళ్లకు తెలుగు తెరపై కనిపించనున్నారు. ఇటీవలె ఆర్జీవీతో ఓ సినిమా అనౌన్స్ చేశారు ఉపేంద్ర. ఇందులో ఆయన గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారు. ఇక వరుణ్‌తేజ్ గని చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తుంది.
తాజాగా మహేశ్ బాబు సినిమా కోసం త్రివిక్రమ్ ఉపేంద్రను ఎంపిక చేసినట్లు ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఓ కీలకమైన పాత్ర కోసం ఉపేంద్రను సంప్రదించగా, ఆయన కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే మరింత క్లారిటీ రానుంది. ఇక మహేశ్‌బాబు నటిస్తున్న సర్కారు వారి పాట షూటింగ్ ముగింపు దశలో ఉంది. ఈ మూవీ అనంతరం మహేశ్- త్రివిక్రమ్‌ల ప్రాజెక్ట్ సెట్స్ మీదకి వెళ్లనుంది.
Comments
Please login to add a commentAdd a comment