ఫిల్మ్ ఇండస్ట్రీలో సక్సెస్ అనేది చాలా ముఖ్యం. ఎంత పెద్ద హీరో అయినా, డైరెక్టర్ అయినా హిట్ లేకుంటే అంతే సంగతి. ఒకటి రెండు ఫ్లాప్స్ వచ్చాయంటే ఇండస్ట్రీ అతన్ని పక్కన పెట్టేస్తుంది. డైరెక్టర్ల విషయం ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఓ స్టార్ హీరోతో తీసిన సినిమా ఫ్లాప్ అయిందంటే.. ఆ క్రెడిట్ అంతా డైరెక్టర్ ఖాతాలోకే వెళ్తుంది. అతనితో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు ముందుకు రారు. తాజాగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ విషయంలో అదే జరిగినట్లు తెలుస్తోంది. ‘గుంటూరు కారం’ ఎఫెక్ట్ గురుజీపై బాగానే పడినట్లు అనిపిస్తుంది.
(చదవండి: భారీ ధరకు ‘దేవర’ ఓవర్సీస్ రైట్స్.. ఎన్టీఆర్‌కి పెద్ద భారమే!)
ఈ చిత్రం విడుదలకు ముందు.. అల్లు అర్జున్‌తో సినిమా చేయబోతున్నట్లు త్రివిక్రమ్ ప్రకటించాడు. అయితే సినిమా రిలీజ్ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ‘గుంటూరు కారం’ చిత్రానికి కలెక్షన్స్ బాగానే వచ్చినప్పటికీ.. సినిమాకు తొలి రోజు నుంచే నెగెటివ్ టాక్ వినిపిసించింది. ఇందులో త్రివిక్రమ్ మ్యాజిక్ మిస్ అయిందనే కామెంట్స్ వినిపించాయి. మహేశ్ కారణంగా సినిమాకు ఆ స్థాయి కలెక్షన్స్ వచ్చాయని సినీ పండితులు అభిప్రాయపడ్డారు. మహేశ్ లాంటి స్టార్ హీరోని త్రివిక్రమ్ సరిగా వాడుకోలేకపోయాడని నెటిజన్స్ ట్రోల్ చేశారు. ఇవన్నీ చూసిన బన్నీ.. తివ్రిక్రమ్‌ని పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది.
(చదవండి: రూపాయి తీసుకోకుండా సినిమా చేయనున్న మహేశ్! కారణం అదేనా?)
పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బోయపాటి-అల్లు అరవింద్ కాంబోలో సినిమా రాబోతుందని గీతా ఆర్ట్స్ అఫిషియల్‌గా ప్రకటించింది. అయితే ఈ చిత్రంలో హీరో ఎవరనేది ఇంకా ప్రకటించలేదు. కానీ అల్లు అర్జున్‌తోనే బోయపాటి సినిమా ఉండబోతుందని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే బన్నీకి బోయపాటి కథ వినిపించాడట. ఆయన ఓకే చెప్పిన తర్వాత గీతా ఆర్ట్స్ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. పుష్ప 2 రిలీజ్ తర్వాత ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లబోతున్నట్లు సమాచారం. అంట్లీతో సినిమా కంప్లీట్ చేసిన తర్వాతే బోయపాటి మూవీ ఉంటుందని మరో ప్రచారం సాగుతోంది. ఈ రెండు చిత్రాలతో పాటు సందీప్ రెడ్డి వంగాతో కూడా బన్నీ ఓ సినిమా చేయబోతున్నాడట. ఇవన్నీ వరుసగా రాబోతున్న చిత్రాలు. ఈ లెక్కన చూస్తే.. ఇప్పట్లో త్రివిక్రమ్‌తో బన్నీ సినిమా రావడం కష్టమే.
Comments
Please login to add a commentAdd a comment