

టాలీవుడ్ మాటల మాంత్రికుడు అనగానే గుర్తొచ్చే పేరు త్రివిక్రమ్.

ఈయన సినిమా అంటే కచ్చితంగా అందులో మాటలు తూటాల్లా పేలుతాయి.

ఈయన చేసిన కొన్ని సినిమాలైతే మాటల వల్లే హిట్ అయ్యాయని చెప్పొచ్చు.

డైరెక్టర్ త్రివిక్రమ్ పుట్టినరోజు నేడు (నవంబర్ 7). ఈ సందర్భంగా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు.

భీమవరంలో పుట్టి పెరిగిన త్రివిక్రమ్ అసలు పేరు ఆకెళ్ళ నాగ శ్రీనివాస్.

ఆంధ్రా యూనివర్సిటీలో అణు కేంద్రశాస్త్రంలో ఎమ్మెస్సీలో గోల్డ్ మెడలిస్ట్.

కానీ సినిమాలపై మక్కువతో నటుడు-రచయిత పోసాని కృష్ణమురళి వద్ద సహాయకుడిగా చేరాడు.

‘స్వయంవరం’ సినిమాతో కథ, మాటలు రచయితగా టాలీవుడ్‌లోకి వచ్చారు.

'నువ్వే నువ్వే' సినిమాతో దర్శకుడిగా మారాడు. 'అతడు'తో తన పేరు మార్మోగిపోయేలా చేసుకున్నాడు.

జల్సా, ఖలేజా, అత్తారింటికే దారేది, జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అఆ, అరవింద సమేత.. ఇలా త్రివిక్రమ్ హిట్ సినిమాలు బోలెడు.

అప్పట్లో కామెడీ అంటే అర్థమై అర్థం కానట్లు దర్శకులు-రచయితలు రాసేవారు. కానీ త్రివిక్రమ్ ఆ ట్రెండ్ మార్చేశాడు.

అందరూ వాడుక భాషల్లో మాట్లాడుకునే మాటల్నే తన చాతుర్యంతో చమత్కారంగా రాసి మాటల మాంత్రికుడు అయిపోయాడు.

2020లో 'అల వైకుంఠపురములో'.. 2024లో 'గుంటూరు కారం' తీశాడు. ఇలా త్రివిక్రమ్ చాలా స్లో అయిపోయాడు.

రాజమౌళి, సుకుమార్ లాంటి దర్శకుడు పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకుంటే.. త్రివిక్రమ్ మాత్రం ఇంకా ఇక్కడే ఉండిపోయాడు.

త్వరలో అల్లు అర్జున్‌తో మైథలాజికల్ స్టోరీతో పాన్ ఇండియా మూవీ తీయబోతున్నాడని అంటున్నారు.

ఈ ప్రాజెక్ట్ తోనైనా పాన్ ఇండియా లీగ్‌లోకి త్రివిక్రమ్ చేరుతాడేమో చూడాలి?