
త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీని ఎట్టిపరిస్థితుల్లోనూ ఆగస్ట్ లోనే రిలీజ్ చేస్తామని సహ నిర్మాత నాగవంశీ గతంలోనే చెప్పుకొచ్చాడు. ఇప్పుడు అదే మాటపై ఉన్నాడు. మహేష్ బాబు న్యూ మూవీ ఎట్టి పరిస్థితుల్లో ఆగస్ట్ లోనే ప్రేక్షకుల తీసుకువచ్చేందుకుగట్టిగానే షూటింగ్స్ షెడ్యూల్స్ ఫిక్స్ చేశారు. దాదాపు పది కోట్లతో ఇంటి సెట్ వేస్తున్నారు. త్వరలో ఇదే సెట్‌లో షూటింగ్ జరగనుంది.
అయితే సెంటిమెంట్ కోసమే ఈ చిత్రాన్ని ఆగస్ట్‌లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడట త్రివిక్రమ్. మహేశ్ బాబు నటించిన చిత్రాలన్నీ ఆగస్ట్‌లో మంచి విజయం సాధించాయి. 2004లో ఆగస్ట్ 18న అర్జున సినిమా విడుదలైన హిట్ టాక్‌ని సంపాదించుకుంది. 2005 ఆగస్ట్ 10న ‘అతడు’ ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.
ఆ తర్వాత చాలా కాలానికి 2015 ఆగస్ట్ 7న శ్రీమంతుడు విడుదలైంది. ఈ సినిమా చిన్న సైజ్ బాక్సాఫీస్ సునామిని తీసుకొచ్చింది.సెంటిమెంట్ పరంగా చూసుకుంటే మహేశ్‌కు, ఆగస్ట్ బాగా కలిసొచ్చింది. ఇప్పుడు త్రివిక్రమ్ సినిమా రిలీజ్ తో ఈ సెంటిమెంట్ మరింత బలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment