
Katrina Kaif Forced Vicky Kaushal To Have A Wedding In December: ఏడువందల ఏళ్ల నాటి కోట సాక్షిగా హీరో విక్కీ కౌశల్, హీరోయిన్ కత్రినా కైఫ్ ఏడడుగులు వేయనున్నారన్నది బాలీవుడ్ తాజా టాక్. కొంత కాలంగా ప్రేమలో ఉన్న ఈ ఇద్దరూ మూడు ముళ్ల బంధంతో ఒక ఇంటివారు కావాలనుకుంటున్నారన్నది ప్రచారంలో ఉన్న వార్త. ఈ విషయం గురించి ఇద్దరూ అధికారికంగా ప్రకటించలేదు కానీ పెళ్లి పనులు మాత్రం జోరుగా జరుగుతున్నాయట.
వివాహ వేదికగా రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాని ఫిక్స్ చేశారని సమాచారం. ఇది దాదాపు ఏడువందల ఏళ్ల చరిత్ర ఉన్న కోట. ఈ కోటలోని లగ్జరీ హోటల్‌లో విచ్చేసే అతిథుల కోసం గదులు బుక్ చేయడం, వారిని పికప్ చేసుకోవడానికి కార్లు బుక్ చేయడం కూడా జరిగిపోయిందని భోగట్టా. వచ్చే నెల 7 నుంచి 9 లోపు వివాహం జరుగుతుందట. మెహందీ, సంగీత్ వంటి వేడుకలను ఆ కోటలోనే ప్లాన్ చేశారని బాలీవుడ్ అంటోంది.
వార్తల్లో ఉన్న ప్రకారం వచ్చే ఏడాది మేలో పెళ్లి చేసుకోవాలని విక్కీ అనుకున్నారట. కానీ వేసవి వెడ్డింగ్ కత్రినాకి నచ్చలేదట. ఎంచక్కా వింటర్‌లో కూల్ కూల్‌గా పెళ్లి చేసుకుంటే బాగుంటుందని విక్కీతో అన్నారట. అందుకే డిసెంబర్‌లో పెళ్లి ముహూర్తాన్ని ఫిక్స్ చేశారని టాక్.
Comments
Please login to add a commentAdd a comment