విక్కీ-కత్రినా పెళ్లిలో సెల్‌ఫోన్ల బ్యాన్‌పై నటుడు స్పందన, పోస్ట్‌ వైరల్‌ | Gajraj Rao Confirms Vicky Kaushal And Katrina Kaif Wedding And Mobile Ban | Sakshi
Sakshi News home page

Vicky Koushal-Katrina Kaif Marraige: కత్రినా-విక్కీల వెడ్డింగ్‌పై నటుడు స్పష్టత

Published Wed, Dec 1 2021 4:00 PM | Last Updated on Wed, Dec 1 2021 8:22 PM

Gajraj Rao Confirms Vicky Kaushal And Katrina Kaif Wedding And Mobile Ban - Sakshi

Actor Gajrajrao Objects Mobiles Ban In Vicky Kaushal-Katrina Kaif Marriage: కొద్ది రోజులుగా బాలీవుడ్‌ లవ్‌బర్డ్స్‌ విక్కీ కౌశల్‌-కత్రినా కైఫ్‌ల పెళ్లి వార్తలు హాట్‌టాపిక్‌గా నిలుస్తున్నాయి. మొదటి నుంచి వీరి రిలేషన్‌ను గోప్యంగా ఉంచుతూ వస్తున్న ఈ జంట దీపావళి పండుగ సందర్భంగా సీక్రేట్‌ రోకా ఫంక్షన్‌ జరుపుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత నుంచి వరుసగా వీరి పెళ్లి వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే వారి వివాహనికి సంబంధించి అప్‌డేట్స్‌ను ఈ జంట గొప్యంగా ఉంచాలనుకున్నప్పటికీ బయటకు వస్తూనే ఉన్నాయి ఉంచుతున్నారు. ఈ నేపథ్యంలో విక్కీ-కత్రినాల పెళ్లి తేదీ ఖరారైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

చదవండి: Katrina Kaif-Vicky Kaushal Marriage: డిసెంబర్‌ మొదటి వారంలోనే పెళ్లి, ఫస్ట్‌ కోర్టులో వివాహం!

కాగా డిసెంబర్‌ 9వ తేదీకి వీరి పెళ్లి ముహుర్తం ఖారారైందని, రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లోని రిసార్ట్ అయిన సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారా వీరి వివాహ మహోత్సవం జరగనుందంటూ వార్తలు వస్తున్నాయి. అంతేగాక వీరి పెళ్లికి ముబైల్‌ ఫోన్స్‌ కూడా బ్యాన్‌ చేసినట్లు బి-టౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా దీనిపై ప్రముఖ నటుడు గజ్‌రాజ్‌ రావు వ్యంగ్యంగా స్పందించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన విక్కీ-కత్రినాల ఫొటోను షేర్‌ చేస్తూ వివాహ సమయంలో సెల్‌ఫోన్‌లు బ్యాన్‌ చేశారు. ‘సెల్ఫీ తీసుకోవడానికి కూడా వీలు లేదంటే నేను పెళ్లికి రాను’ అంటూ సరదాగా పోస్ట్‌ షేర్‌ చేశాడు.

చదవండి: మనసుకు బాధగా ఉంది మిత్రమా: ఇళయరాజా భావోద్వేగం

దీంతో ఈ పోస్ట్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇక ఈ పోస్టుతో వారి పెళ్లిపై వస్తున్న వార్తలకు స్పష్టత వచ్చిందంటున్నారు నెటిజన్లు. సెల్‌ఫోన్‌లు బ్యాన్‌ చేస్తే కష్టమని, విక్కీ-కత్రినాలు ఎందుకు ఇంత ఓవరాక్షన్‌ చేస్తున్నారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. కాగా రాజస్థాన్‌ పయనమయ్యే ముందు ముంబైలో విక్కీ-కత్రినాలు కోర్టు వివాహం చేసుకొన్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక పెళ్లికి ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉండటంతో ఏర్పాట్లతో బిజీగా ఉన్నారట ఇరు కుటుంబ సభ్యులు. అయితే పెళ్లి కేవలం 200 మందికి మాత్రమే ఆహ్వానం ఉన్నట్లు సినీ వర్గాల నుంచి సమాచారం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement