![Katrina Kaif Reveals Huge Fight at Her and Vicky Kaushal wedding - Sakshi](/styles/webp/s3/article_images/2022/11/9/katrina-kaif123.jpg.webp?itok=EDvXXRTt)
బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్, హీరో విక్కీ కౌశల్ గతేడాది వైవాహిక జీవితంలో అడుగుపెట్టారు. షూటింగ్ గ్యాప్ దొరికితే ఇద్దరూ కలిసి ఎంచక్కా విహార యాత్రలకు లేదా డిన్నర్ డేట్స్‌కు వెళ్తుంటారు. అలాగే ఇంటర్వ్యూలలో ఒకరి సీక్రెట్స్ గురించి మరొకరు చెప్పుకోవడానికి అస్సలు వెనుకాడరు. అయితే ఈసారి కత్రినా ఓ పెద్ద విషయాన్ని ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ఆనందంగా సాగిపోతుందనుకున్న తన పెళ్లిలో కొందరు చెప్పులతో కొట్టుకున్నారని వెల్లడించింది.
ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. 'పెళ్లి పందిట్లో కూర్చున్న నాకు వెనకాల నుంచి గట్టిగట్టిగా అరుపులు వినిపించాయి. ఏంటా? అని వెనక్కు తిరిగి చూస్తే అక్కడ పెద్ద గొడవే జరుగుతోంది. చెప్పులు విసిరేసుకుంటూ కొట్టుకుంటున్నారు. వాళ్లలో నా చెల్లెళ్లు, విక్కీ స్నేహితులు ఉన్నారు. చివరగా ఆ ఫైట్‌లో ఎవరు గెలిచారనేది మాత్రం అడగడమే మర్చిపోయా' అని చెప్పుకొచ్చింది క్యాట్. కాగా రెండేళ్ల డేటింగ్ అనంతరం గతేడాది డిసెంబర్‌లో పెళ్లి చేసుకున్నారు విక్కీ, కత్రినా. వీరి సినిమాల విషయానికి వస్తే కత్రినా టైగర్ 3, మేరీ క్రిస్‌మస్, జీలె జరా సినిమాలు చేస్తోంది. విక్కీ.. గోవిందా నామ్ మేరా, సామ్ బహదూర్ చిత్రాల్లో కనిపించనున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment