Vicky Kaushal Engagement With Katrina Kaif: బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్, బ్యూటిఫుల్ హీరోయిన్ కత్రినా కైఫ్ మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తోందంటూ పుకార్లు షికార్లు చేస్తోన్న విషయం మనందరికీ తెలిసిందే! పార్టీలలో కలిసి సందడి చేయడమే కాక పండగల టైంలో ట్రిప్‌కు కూడా వెళ్తుందీ ప్రేమ జంట. అంతేకాదు, వీరిద్దరూ ఒకరి ఇంటికి మరొకరు తరచూ వెళుతుంటారు. తాజాగా వారిద్దరూ ఓ ఫంక్షన్‌లో గట్టిగా హగ్గులిచ్చుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ నేపథ్యంలో విక్కీ తన పెళ్లి గురించి మాట్లాడిన ఇంటర్వ్యూ ఒకటి వైరల్‌గా మారింది.
కత్రినాతో నిశ్చితార్థం జరుపుకుంటున్నారా? అన్న ప్రశ్నకు విక్కీ నవ్వుతూ.. 'ఈ వార్తలు మీడియానే ప్రసారం చేస్తోంది. సరైన సమయం వస్తే త్వరలోనే నేను నిశ్చితార్థం చేసుకుంటాను. కాకపోతే అందుకు మంచి టైం కుదరాలంతే!' అని చెప్పుకొచ్చాడు. కానీ తను వేలు పట్టుకుని నడిచే అమ్మాయి పేరు మాత్రం వెల్లడించలేదు. కాగా ఆగస్టులో విక్కీ, కత్రినాకు పెళ్లి కుదిరిందని, వారిది రోకా ఫంక్షన్ కూడా జరిగినట్లు నెట్టింట వార్తలలు ప్రసారమయ్యాయి. అయితే కత్రినా తరపు బంధువులు ఈ వార్తల్లో నిజం లేదని కొట్టిపారేశారు.
Comments
Please login to add a commentAdd a comment