లవ్‌బర్డ్స్‌  పెళ్లి,  ఆహ్వానాలు అందుకే పంపడం లేదట! | Lovebirds Katrina Kaif Vicky Kaushal havent sent out wedding invites why | Sakshi
Sakshi News home page

Katrina -Vicky Marraige: ఆహ్వానాలు అందుకే పంపడం లేదట!

Published Fri, Nov 5 2021 4:56 PM | Last Updated on Fri, Nov 5 2021 5:10 PM

Lovebirds Katrina Kaif Vicky Kaushal havent sent out wedding invites why - Sakshi

సాక్షి,ముంబై: బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కత్రినా కైఫ్ పెళ్లి వార్త మరోసారి గుప్పుమంది. గ‌త కొద్ది రోజులుగా కత్రినా, తన ప్రియుడు విక్కీ కౌశల్‌తో ఏడడుగులు వేయనుందనే వార్త‌లు వ‌స్తున్న సంగతి తెలిసిందే. దీనికితోడు పెళ్లిపై  పలు రూమర్లు కొనసాగుతుండగానే ఈ దీపావళి వేడుకల్లో ప్రొడ్యూసర్‌   ఆర్తీ శెట్టి నివాసం వద్ద ఈ జంట కంటబడటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.

తాజా నివేదికల ప్రకారం త్వరలోనే ఈ లవ్‌ బర్డ్స్‌ మూడు ముళ్ల బంధంతో ఒకటి కానున్నారనీ, దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చాలా రహస్యంగా చేసుకుంటూ పోతున్నారని తెలుస్తోంది.  అందుకే వెడ్డింగ్‌ ఇన్విటేషన్స్‌ కూడా ఇంకా  ఎవరికీ పంపడం లేదని  టాక్‌.  అంతేకాదు కాబోయే  కోడలికి విక్కీ కౌశల్ తల్లి వీణా కౌశల్ దీపావళి కానుకగా చీర, నగలు పంపినట్టు కూడా తెలుస్తోంది.  దీంతో విక్కీ కుటుంబం నుంచి కత్రీనాకు షాగున్ (ప్రత్యేక బహుమతి) అందిందంటూ బీటౌన్‌లో వీరి వివాహానికి సంబంధించిన ఊహాగానాలు తెగ హల్‌చల్‌ చేస్తున్నాయి. 

ఈ జంట డిసెంబర్ 7 లేదా 9  తేదీల్లో  రాజస్థాన్‌లో అంగరంగ వైభవంగా పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమవుతున్నారు. అయితే తమ పెళ్లి వార్త ఏ మాత్రం బయటికి పొక్కకుండా చాలా జాగ్రత్తలు తీసు కుంటున్నారట. ఈ నేపథ్యంలోనే ఈ జంట ఇంకా వివాహ ఆహ్వానాలను కూడా ఇంకా ఎవరికి పంపలేదట. మరీ ముఖ్యంగా తన వ్యక్తిగత జీవితం విషయాలపై చాలా జాగ్రత్తగా ఉండే కత్రినా ఇటీవల తమ వెడ్డింగ్‌ ప్లేస్‌పై మీడియాలు వార్తలు రావడంపై  చాలా అసహనంగా ఉందని సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. అందుకే మరింత లీక్‌ కాకుండా  జాగ్రత్తలు తీసుకుంటున్నారట. అంతేకాదు తాజా లీకుల నేపథ్యంలో పెళ్లి వేదికను కూడా మార్చే ప్లాన్‌లో ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. 

అయితే ఇండస్ట్రీకి వచ్చిన ఈ 15 ఏళ్ల నుంచి తన పెళ్లి వార్తలు  ఏదో ఒక రూపంలో వస్తూనే ఉన్నాయి..నెలకు ఎన్ని పెళ్లిళ్లు చేస్తారు అంటూ ఇటీవల కత్రినా మండి పడినప్పటికీ ఈ బ్యూటీ  పెళ్లి వార్త బజింగ్‌గానే నిలుస్తోంది. మరి ఈ విషయంపై విక్కీ-కత్రినా అధికారికంగా ప్రకటించేంతవరకు ఈ సస్పెన్స్‌కు తెరపడదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement