invitation cards
-
పెళ్లి ఆహ్వానంలో సరికొత్త ట్రెండ్.. కార్డులిచ్చే రోజులు పోయాయి..
సాక్షి వరంగల్: మా ఇంట్లో పెళ్లికి రండి.. అంటూ ఆప్యాయమైన పెళ్లి పత్రిక పలకరింపు మారింది. ఒకప్పుడు మేళతాళాలతో బంధువుల ఇళ్లకు తిరుగుతూ.. బొట్టు పెట్టి మరీ పత్రిక చేతికిచ్చి ఆహ్వానించేవారు. ఇంట్లో ఎవరూ లేకుంటే గుమ్మానికి బొట్టు పెట్టి.. పెళ్లి కార్డు తలుపునకు పెట్టేవారు. దూరంగా ఉన్న ఊళ్లకు ప్రింట్ చేయించిన కార్డులను ఇంటి.. నాయీబ్రాహ్మణుడు లేదా రజకులకు ఇచ్చి పంపిణీ చేయించేవారు. ఈ ఆనవాయితీ కొన్ని పల్లెల్లో ఇప్పటికీ కొనసాగుతున్నా.. మారుతున్న కాలం.. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఆ సంప్రదాయానికి స్వస్తి పలికారు. నామమాత్రంగా 200 కార్డులు.. అంతకన్నా కొంచెం ఎక్కువ.. తక్కువగా ప్రింట్ చేయించడం.. సోషల్ మీడియా ద్వారా బంధువులు, స్నేహితుల గ్రూపు తయారు చేసి అందులో కార్డు పెట్టి పిలిచే విధానానికొచ్చింది. వాట్సాప్‌లో కార్డు పెడుతున్నారు. కొందరికి ఫోన్ చేసి పెళ్లికి రండి అని సెలవిస్తున్నారు. ప్రస్తుతమిది పెళ్లిళ్ల సీజన్. మన పెళ్లి పిలుపులు ప్రస్తుతం ఎలా మారాయో చూద్దాం.. పెళ్లికార్డు.. పిలుపు ఇలా.. నాటి పెళ్లి పత్రికల్లో సీతారాములు ఉండేవారు. సీతాదేవి వరమాలతో సిగ్గులొలికిస్తుంటే రాముడు కోదండ ధారుడై ఓరచూపులతో సీతను చూస్తుండేవాడు. క్రమంగా వాళ్ల స్థానంలోకి వధూవరులు వచ్చేశారు. పెళ్లి కార్డులు ప్రింటింగ్ ప్రెస్ నుంచి కాకుండా.. ఫొటోసూ్టడియోల నుంచి ఫొటోల రూపంలోనే వచ్చేశాయి. తాజాగా ఇప్పటి పెళ్లి కార్డు ఈ మెయిల్, వాట్సాప్‌లలో వస్తోంది. ఫోన్లో పెళ్లి పత్రికను(పెళ్లి ఫైల్ అనాలి మరి..) ఓపెన్ చేయగానే బ్యాక్‌గ్రౌండ్ పాటతో వధూవరుల ఫొటోలు, వారి పేర్లు, వేదిక వివరాలతో చివరగా ‘డేట్ సేవ్ చేసుకోండి’ అని వీడియో ప్లే అవుతోంది. వాట్సాప్ గ్రూప్ కాల్ చేసి.. సమయాభావం వల్ల వ్యక్తిగతంగా వచ్చి కార్డు ఇవ్వలేకపోతున్నాం.. అంటూ అందరితో ఒకేసారి మాట్లాడి.. పెళ్లికి తప్పకుండా హాజరుకావాలంటూ కోరడం ఇప్పుడు మామూలైంది. వాట్సాప్ గ్రూపులో పెళ్లి సందడి.. బ్రాహ్మణుడు లగ్న పత్రిక రాసింది మొదలు.. పెళ్లి సందడి షురువైనట్లే. మెహందీ, సంగీత్, మంగళ స్నానాలు, పెళ్లి తేదీ, సమయం, వేదిక మొదలు అన్నింటినీ తెలిపే విధంగా ఒక వాట్సాప్ గ్రూప్.. పెళ్లి జరుగుతున్న వారి ఇంటి పేరుతో క్రియేట్ చేస్తారు. అందులో దగ్గరి, దూరపు బంధువులు, స్నేహితుల ఫోన్ నంబర్లన్నీ చేర్చి.. వేడుకలు షురువైనప్పటి నుంచి ఆ ఫొటోలను అందులో అప్లోడ్ చేయడం.. కార్యక్రమానికి హాజరైన బంధుమిత్రులు సైతం పెళ్లి కుమార్తె లేదా కుమారుడితో దిగిన ఫొటోలు షేర్ చేయడం కొత్త ఆనవాయితీకి తెరలేపినట్లయింది. ఆ ఫొటోలు చూసిన గ్రూపులోని వారు సైతం మరీ గుర్తు చేసుకుని తాము కూడా పెళ్లికి వెళ్లాలనే ఆతృత వారిలో పెరిగేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు 200 కార్డులే.. కరోనా ముందు వరకు ఓ ఇంట్లో పెళ్లి జరిగితే దాదాపు వెయ్యి కార్డుల వరకు ఆహ్వాన పత్రికలు ఆర్డర్ ఇచ్చేవారు. ఇప్పుడు 200 వరకు ప్రింట్ చేయించుకుంటున్నారు. అవి కూడా లేటెస్ట్ డిజైన్లు కావాలని కోరుతున్నారు. ఎందుకంటే.. డిజైన్ చేసిన పెళ్లి ఆహ్వాన పత్రికతోపాటు ప్రోమో వీడియోలను వాట్సాప్ ద్వారానే పంపిస్తున్నారు. దీంతో కార్డుల ప్రింటింగ్ తగ్గించారు. – బోడకుంట్ల సంపత్, ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకుడు, వరంగల్ సైకిల్‌పై వెళ్లి ఇచ్చాం.. మా నాన్న వాళ్లు సైకిళ్లపై.. దూరమైతే బస్సుల్లో వెళ్లి పెళ్లి కార్డులు ఇచ్చి వచ్చేవాళ్లు. ఎడ్ల బండిపై కూడా వెళ్లి పంచేవాళ్లు. కొన్నిసార్లు నడుచుకుంటూ వెళ్లి పెళ్లి పత్రికలు ఇచ్చిన సందర్భాలున్నాయి. అదే ఇప్పుడైతే గ్రామం వరకే పరిమితమైంది. కొందరికి పెళ్లి కార్డులు లేదంటే ఇంటింటికి వెళ్లి చెప్పి వస్తున్నాం. పెళ్లింటి వారే వాట్సాప్‌లలో కార్డులు పంపుతున్నారు. – పంతంగి రజనీకాంత్, రజక కులపెద్ద, ధర్మారావుపేట ఒత్తిడిలో మరిచినా.. క్షణాల్లో చేరవేత.. పెళ్లి పనులన్నీ ఒక ఎత్తయితే.. కార్డుల పంపిణీ అనేది కత్తిమీద సాముతో కూడుకున్న పని. అయినా దగ్గరి బంధువుల ఇంటికి వెళ్లి పెళ్లి పత్రికలు ఇవ్వడం.. పెళ్లి పనుల ఒత్తిడిలో పడి కొందరికి కార్డులు ఇవ్వడం కూడా మరిచిపోతుంటాం. అందుకే.. వాట్సాప్ ద్వారానే ప్రతి ఒక్కరికి పెళ్లి కార్డులు పంపించాం. వీడియో ప్రోమోలు కూడా సెండ్ చేశాం. సెకన్ల వ్యవధిలోనే అందరికీ ఆహ్వాన పత్రికలు పంపించగలిగాం. గతంలో పెళ్లి కార్డుల పంపిణీకి నెలరోజుల ముందు నుంచే బాగా కసరత్తు చేసేవాళ్లం. ఇప్పుడు కాస్త సులువైంది. – గంగధార మురళి, తండ్రి నెలరోజుల ముందు నుంచే.. గతంలో నెల రోజుల ముందే పెళ్లి కార్డులు మాకు ఇచ్చేవారు.. రజక, నాయీబ్రాహ్మణుల సహాయంతో తమ బంధువులు ఉండే ఊర్లకు పంపించి పెళ్లి కార్డులు ఇచ్చేలా చూశాం. వారికి తలా కొన్ని కార్డులు ఇచ్చి ఏ ఊరికి పోవాలో చెప్పేవాళ్లం. కొన్ని సందర్భాల్లో కార్డు తీసుకునేవారు ఇంటి వద్ద లేకపోతే పక్క ఇంటివారికి ఇచ్చి మళ్లీ వచ్చాక ఇవ్వమని చెప్పిన సందర్భాలున్నాయి. సొంత ఊరిలో కుల బంధువుల ఇంటికి వెళ్లి వారి దర్వాజకు బొట్టు పెట్టి, ఆ ఇంట్లో వారికి కూడా బొట్టు పెట్టి పెళ్లి కార్డులు ఇచ్చి ఆహ్వానించాం. ఇప్పటికీ ఊళ్లలో ఈ సంప్రదాయం కొనసాగుతోంది. కానీ నోటిమాటగా చెబుతున్నారు. కార్డులు ఇవ్వడం తగ్గించారు. ఏదో వాట్సాప్ అంట.. అందులో కార్డులు పంపిస్తుండ్రు. – కె.లచ్చమ్మ, బంధనంపల్లి, రాయపర్తి మండలం -
పెళ్లి పత్రికలు పంచి వస్తుండగా ....
ఓడీ చెరువు: మరో ఐదు రోజుల్లో తన చిన్న కుమార్తె యశస్విని వివాహం జరగనుంది. ఇల్లంతా హడావుడిగా ఉంది. నగలు, పట్టువస్త్రాలు అన్నీ సిద్ధం చేశాడు. పెళ్లి సామగ్రి కొనాలి. బంధువులను పిలవాలి. స్నేహితులు, తెలిసిన వారికి పెళ్లిపత్రికలు పంచి, ఇంటికి వెళ్తున్నాడు. అంతలోనే రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. ఇంటిపెద్ద మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాలు.. ఓడీ చెరువు మండలం నల్లగుట్లపల్లికి చెందిన కొట్టాల పద్మనాభరెడ్డి (55) పెళ్లి పత్రికలు పంచి స్కూటీపై స్వగ్రామానికి వెళ్తున్నాడు. కదిరి – హిందూపురం రహదారిపై నల్లగుట్లపల్లి రోడ్డు మలుపువద్ద వెనుకవైపు నుంచి కారు వేగంగా వచ్చి ఢీకొనింది. సుమారు పది మీటర్ల మేర స్కూటీతో పాటు వాహనదారుడిని తోచుకెళ్లింది. ఈ ప్రమాదంలో పద్మనాభరెడ్డి తలకు బలమైన గాయం అయ్యింది. తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికులు ప్రమాదానికి కారణమైన కారులో కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి పత్రికలు పంచి ఇంటికి వస్తావనుకుంటే అంతలోనే కానరానిలోకానికి వెళ్లితివా.. నాన్నా అంటూ కుమార్తె యశస్విని రోదిస్తోంది..భార్య, బంధువుల ఆర్తనాదాలు అక్కడున్న వారిని కంటతడిపెట్టించాయి. (చదవండి: తమదే అనుకుని వేరే బైకులో రూ. 2.80 లక్షలు ఉంచి.. చివరకు..) -
లవ్‌బర్డ్స్ పెళ్లి, ఆహ్వానాలు అందుకే పంపడం లేదట!
సాక్షి,ముంబై: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ పెళ్లి వార్త మరోసారి గుప్పుమంది. గత కొద్ది రోజులుగా కత్రినా, తన ప్రియుడు విక్కీ కౌశల్‌తో ఏడడుగులు వేయనుందనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనికితోడు పెళ్లిపై పలు రూమర్లు కొనసాగుతుండగానే ఈ దీపావళి వేడుకల్లో ప్రొడ్యూసర్ ఆర్తీ శెట్టి నివాసం వద్ద ఈ జంట కంటబడటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. తాజా నివేదికల ప్రకారం త్వరలోనే ఈ లవ్ బర్డ్స్ మూడు ముళ్ల బంధంతో ఒకటి కానున్నారనీ, దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చాలా రహస్యంగా చేసుకుంటూ పోతున్నారని తెలుస్తోంది. అందుకే వెడ్డింగ్ ఇన్విటేషన్స్ కూడా ఇంకా ఎవరికీ పంపడం లేదని టాక్. అంతేకాదు కాబోయే కోడలికి విక్కీ కౌశల్ తల్లి వీణా కౌశల్ దీపావళి కానుకగా చీర, నగలు పంపినట్టు కూడా తెలుస్తోంది. దీంతో విక్కీ కుటుంబం నుంచి కత్రీనాకు షాగున్ (ప్రత్యేక బహుమతి) అందిందంటూ బీటౌన్‌లో వీరి వివాహానికి సంబంధించిన ఊహాగానాలు తెగ హల్చల్ చేస్తున్నాయి. ఈ జంట డిసెంబర్ 7 లేదా 9 తేదీల్లో రాజస్థాన్‌లో అంగరంగ వైభవంగా పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమవుతున్నారు. అయితే తమ పెళ్లి వార్త ఏ మాత్రం బయటికి పొక్కకుండా చాలా జాగ్రత్తలు తీసు కుంటున్నారట. ఈ నేపథ్యంలోనే ఈ జంట ఇంకా వివాహ ఆహ్వానాలను కూడా ఇంకా ఎవరికి పంపలేదట. మరీ ముఖ్యంగా తన వ్యక్తిగత జీవితం విషయాలపై చాలా జాగ్రత్తగా ఉండే కత్రినా ఇటీవల తమ వెడ్డింగ్ ప్లేస్‌పై మీడియాలు వార్తలు రావడంపై చాలా అసహనంగా ఉందని సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. అందుకే మరింత లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. అంతేకాదు తాజా లీకుల నేపథ్యంలో పెళ్లి వేదికను కూడా మార్చే ప్లాన్‌లో ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇండస్ట్రీకి వచ్చిన ఈ 15 ఏళ్ల నుంచి తన పెళ్లి వార్తలు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉన్నాయి..నెలకు ఎన్ని పెళ్లిళ్లు చేస్తారు అంటూ ఇటీవల కత్రినా మండి పడినప్పటికీ ఈ బ్యూటీ పెళ్లి వార్త బజింగ్గానే నిలుస్తోంది. మరి ఈ విషయంపై విక్కీ-కత్రినా అధికారికంగా ప్రకటించేంతవరకు ఈ సస్పెన్స్‌కు తెరపడదు. -
పెళ్లి పత్రికల్లో మత్తు పదార్థాలు పెట్టి..
సాక్షి, బెంగళూరు : బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయంలో భారీమొత్తంలో మత్తు పదార్థాలు పట్టుబడ్డాయి. పెళ్లిపత్రికల్లో రహస్యంగా తరలిస్తున్న రూ.5.05కోట్ల విలువైన ఎఫెడ్రిన్ అనే మత్తు మందును సీజ్ చేశారు. శనివారం 5.49 కేజీల డ్రగ్స్‌ను పెళ్లిపత్రికల్లో గుట్టుగా అమర్చి తరలిస్తుండగా కార్గో విభాగంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.మదురైకి చెందిన వ్యక్తి డ్రగ్స్ దాచిన 43 శుభలేఖలను ఆస్ట్రేలియాకు తరలిస్తున్నాడు. కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చి తనిఖీ చేయగా పత్రికల మధ్య అమర్చిన ఎఫెడ్రిన్ ప్యాకెట్లు బయటపడ్డాయి. 18న రూ.5 కోట్ల డ్రగ్స్ పట్టివేత ఇదే కార్గో విభాగంలో ఈ నెల 18న బట్టలు కుట్టే యంత్రంలో రూ.5 కోట్ల ఖరీదైన ఎఫెడ్రిన్‌ను రవాణా చేస్తుండగా కస్టమ్స్ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నాలుగు రోజుల వ్యవధిలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడడం కలవరపరుస్తోంది. దీంతో కస్టమ్స్ అధికారులు మరింత లోతుగా తనిఖీలు చేస్తున్నారు. ఈ రెండు కేసుల్లో నిందితులపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. తరచుగా డ్రగ్స్ రవాణా కేసులు బయటపడడం చూస్తుంటే మత్తు రవాణాకు దుండగులు బెంగళూరు ఎయిర్‌పోర్టును ఎంచుకున్నట్లు స్పష్టమవుతోంది. చెన్నై, హైదరాబాద్ విమానాశ్రయాల్లో తనిఖీలను ముమ్మరం చేయడంతో ఇక్కడి నుంచి స్మగ్లింగ్‌కు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. -
కొడుకు పరీక్ష కోసం ఓ తండ్రి ఏం చేశాడంటే..?
కోల్‌కతా : ప్రతీ తల్లిదండ్రులు తమ పిల్లలు బాగా చదువుకొని ప్రయోజకులు కావాలని ఆశిస్తారు. అందుకోసం వారి జీవితాలను కూడా త్యాగం చేసేందుకు సిద్ధమవుతారు. మరికొందరు తాము పొందలేని అవకాశాలు పిల్లలకు కల్పించి వారి భవిషత్తులో ఆనందాన్ని వెతుక్కుంటారు. అలాంటి కోవకు చెందిన వారే.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన రజబ్ అలీ. ఆయన కథేంటో ఓసారి చూద్దాం. పశ్చిమ బెంగాల్‌లోని ముషీరాబాద్‌కు చెందిన అలీ పేదరైతు. వంశపారంపర్యంగా వచ్చిన భూమి తప్ప తనవద్ద ఇంకేమీ లేదు. చిన్ననాటి నుంచి అతనికి డాక్టర్ కావాలనే కోరిక ఉండేది. కానీ ఆరుగురు పిల్లలు ఉండటంతో కుటుంబ పోషణ తండ్రికి భారమైంది. అందుకే మూడో తరగతిలోనే డ్రాపౌట్‌గా మిగిలిపోవాల్సి వచ్చింది. అలా పదేళ్ల వయస్సుకే పొలం పనులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారి కుటుంబంలో ఇంతవరకు ఎవరూ కూడా పదో తరగతి వరకు చదివిన దాఖలాలు లేవు. అందుకే కొడుకు ద్వారా ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలని అలీ కోరుకుంటున్నాడు. పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న తన కొడుకు షమీమ్ షేక్‌ను దీవించాలంటూ ఏకంగా 700 మందికి విందు ఏర్పాటు చేశాడు. తమ కుటుంబంలో పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న మొదటి వ్యక్తి కనుక తాహతుకు మించిన ఈ పనికి సిద్దపడ్డానని తెలిపాడు. కొన్నాళ్ల కిందట ‘నాకు తారసపడిన కొందరు వ్యక్తులు.. గ్రామస్తుల దీవెనలుంటే మీ కొడుకు తప్పక ఉత్తీర్ణుడవుతాడని చెప్పారు. అందుకే సంవత్సర కాలంగా ఈ విందు కోసం డబ్బు పొదుపు చేస్తున్నా’ని తెలిపాడు. అంతేకాకుండా ఒక అడుగు ముందుకేసి ఆహ్వాన పత్రిక కూడా అచ్చువేయించి అందరికీ పంచాడు. అతిథులను ఆనందపరిచేందుకు తన స్థోమతకు తగ్గట్టుగా చికెన్, పప్పు, కూరగాయలు, స్వీట్లతో విందు ఏర్పాటు చేశాడు. ఆ అతిథులు కూడా పెన్నులు, పెన్సిళ్లు, పుస్తకాలను షమీమ్‌కు కానుకలుగా ఇచ్చారు. కానీ వారిచ్చిన బహుమతుల కన్నా వారి దీవెనలే మహాభాగ్యమని మురిసిపోతున్నాడు అలీ. తన కొడుకు పరీక్షలో ఉత్తీర్ణుడైతే ఊరంతా స్వీట్లు పంచుతానని చెబుతున్న అలీ వంటి తండ్రిని తామెక్కడా చూడలేదని స్థానిక స్కూల్ టీచర్ సుశాంత చౌదరీతో పాటు గ్రామస్తులంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -
కమలహాసన్ దువ్వెన
కథ: ఆ రోజు ఉదయం ఏడు గంటల సమయంలో ఇంటి ముందు వరండాలో కూర్చుని కాఫీ తాగుతున్నాను. ఇంతలో తెల్ల యూనిఫారమ్‌లో ఉన్న ఒక వ్యక్తి వచ్చి ఇన్విటేషను కార్డు అందించాడు. అందించడమే కాదు అతని దగ్గర ప్రింటు చేసి ఉన్న లిస్టులో నా పేరున్న సీరియల్ నంబరుకెదురుగా సంతకం పెట్టించుకున్నాడు. ‘ఎవరు పంపారు’ అన్నాను అర్థంగాక. ‘చూసుకోండి’ అన్నట్లు తలాడించి నాకు సెల్యూట్ చేసి వెనక్కు తిరిగి వెళ్లిపోయాడు. నేను ఆశ్చర్యంగా కవరులోంచి ఇన్విటేషన్ కార్డు బయటకు తీశాను. అది పక్కరోజు జరగబోయే షష్టి మహోత్సవ ఆహ్వాన పత్రిక. కింద చూశాను ఇట్లు, మీ మిత్రుడు కె.శ్రీనివాసరావు, ఉరఫ్ కమలహాసన్ అని ఉంది. నాకు చాలా ఆనందమనిపించింది. దాదాపు ఎనిమిదేళ్లు అయింది కమలహాసన్ని చూసి. కారణం అతను వైజాగ్‌లో ఉద్యోగం చేస్తూ అరవై ఏళ్లు పూర్తి కాగానే వారం క్రితం రిటైరయ్యాడు. అరవై ఏళ్లు పూర్తయిన సందర్భంగా తన సొంత ఊరు ఒంగోల్లో తన చిరకాల మిత్రుల మధ్య షష్టిపూర్తి మహోత్సవం చేసుకుంటున్నాడు. ముప్పయ్యేళ్ల క్రితం ఒంగోల్లో నేను ఉద్యోగంలో చేరిన కొత్తలో శ్రీనివాసరావు పరిచయమైంది. కానీ శ్రీనివాసరావుగా కాదు కమలహాసన్‌లా. అప్పుడే అసలు కమలహాసన్ యువ హీరోగా వెండితెరను ఏలుతున్నాడు. యువకులు, యువతులు వేలం వెర్రిగా అతని అభిమానులుగా మారిన నాలుగు దశాబ్దాల క్రితపు కాలమది. నెత్తిన ఒత్తయిన జుట్టు, గుబురుగా పెరిగి పొడవుగా భుజాల మీద వేలాడుతున్న వెంట్రుకలు, కిందికి దిగిన లావు మీసాలు, కళ్లకు స్టైలుగా వెడల్పైన అద్దాలు, బొమ్మల చొక్కా, బెల్‌బాటమ్ ప్యాంటు, స్టైలుగా నడవడం, ఎవ్వరితో ఎక్కువగా మాట్లాడకుండా రిజర్వుడుగా ఉండటం శ్రీనివాసరావు లక్షణాలు. అంతేకాదు, అతని బట్టల నుంచి ఎప్పుడూ సువాసనలు వెదజల్లే సెంటు వాసనలు ఆఫీసంతా చుట్టుముట్టేవి. అతను తలకు ఆనాడు సినిమా నటులు వాడే ఖరీదైన ‘బ్రిల్‌క్రీమ్’ పూసేవాడని, అదే విధంగా దుబాయ్ నుంచి దిగుమతి అయ్యే ఖరీదైన అత్తర్లు, ప్యారిస్‌లో తయారయ్యే సరికొత్త సెంట్లు పూసేవాడని ఆఫీసులో గుసగుసలు చెప్పుకొనేవారు. అతను ఆఫీసు ఖాళీ సమయాల్లో ట్రాన్సిస్టర్ చెవి దగ్గర పెట్టుకుని వరండాలో తిరుగుతూ హిందీ పాటలు వినేవాడు. ఎవరైనా స్నేహం చేయాలనిచూసినా, ఆ అవకాశం ఇచ్చేవాడు కాదు. తనకి హాస్యమన్నా హ్యూమరన్నా చాలా ఇష్టం అనేందుకు గుర్తుగా ఖాళీ సమయాల్లో ఎప్పుడూ అతని చేతిలో బాపూ కార్టూన్ల పుస్తకం గాని, ముళ్లపూడి వ్యంగ్య రచన గాని ఉండేది. మేము డైనింగు రూములో లంచ్ చేసి కుళ్లు జోకులతో కాలం గడిపితే, అతను ఆ సమయంలో ఆ పుస్తకాలు చదువుతూ ఎంజాయ్ చేసేవాడు. ఆ సమయంలో పళ్లు ఇకిలించడం గాని, గొంతు సకిలించడం గాని లేకుండా మౌనంగా వాటిలోని మాధుర్యాన్ని ఆస్వాదించేవాడు. అతన్ని పాతికేళ్ల కాలానికి ముందున్న వ్యక్తిగా భావిస్తూ, మేము అతని ముందు బీసీ కాలపు మానవుల్లా మాకు మేము భావించుకునేవాళ్లం. సెక్షన్ హెడ్లతో సహా అందరం సైకిళ్ల మీద వస్తే అతను మాత్రం ‘దడ్... దడ్...’మంటూ ‘బుల్లెట్’ అని పేరుగాంచిన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మీద రాయల్‌గా దిగేవాడు. ఎప్పుడూ సఫారీ డ్రెస్‌లో ఉండేవాడు. అదే రంగు షూస్ ధరించేవాడు. మేము స్నేహితులం లెఖ్క పెట్టుకుని వంతులవారీగా అతిజాగ్రత్తగా కింద టీ కొట్టుకు వెళ్లి టీ తాగేవాళ్లం. కమలహాసన్ ఏనాడూ కిందికి వెళ్లి టీ తాగేవాడు కాదు. తన సీటు దగ్గరకే టైము ప్రకారం టీ తెప్పించుకుని ఒక్కడే తాగేవాడు. టీ తెచ్చినవాడికి రెండు టీల డబ్బు ఇచ్చేవాడు. అంతేకాదు, నెల మొదటి తేదీన వాడికి ఠంచనుగా అయిదు రూపాయల నోటు బక్షీస్గా పడేసేవాడు. గ్రాము బంగారం యాభై రూపాయలుండే ఆ రోజుల్లో టీ కుర్రాడి జీతం పది రూపాయలు. అలాంటిది ఆదివారాల్లో కాక రోజుకు రెండుసార్లు టీ తెచ్చినందుకు కమలహాసన్ ఇచ్చిన ఐదు రూపాయలకు వాడి కళ్లు కన్నీటితో చెమర్చేవి. సంవత్సరానికొకసారి దసరాకు కూడా బక్షీస్గా రూపాయి ఇవ్వడానికి వంద సాకులు చెప్పి తప్పించుకునే మేము, కమలహాసన్ లగ్జరీ జీవితానికి ఆశ్చర్యపోయేవాళ్లం. పూర్వీకుల సంపద అతని చేతి నిండా ఉండటమే దానికి కారణం. ఇకపోతే కమలహాసన్ వాడేసిన సెంటు సీసాల కోసం, హేర్ ఆయిల్ బాటిళ్ల కోసం, ఇంపోర్టెడ్ పౌడరు డబ్బాల కోసం అటెండర్లు ముందుగానే రిజర్వు చేసుకునేవాళ్లు. ఏదో కాస్తా, కూస్తో తప్పకుండా మిగిలి ఉంటుందని వాళ్ల నమ్మకం. నిజమే, కమలహాసన్ అంతో ఇంతో అడుగున మిగిల్చేవాడు. అడుగు వరకు నాకినట్లు ఉపయోగించడం అతనికి నామోషీ, చిన్నతనం. కమలహాసన్ ఫైలు సీటు నుంచి పోయిందంటే దాని వెంట ఓ సుగంధం నిండిన మలయమారుతం వెళ్లినట్లే. ఆ ఫైలు తీసుకుపోవడానికి అటెండరు కూడా చాలా సంతోషంగా గుండెలకు హత్తుకుని మరీ తీసుకువెళ్తాడు. కారణం ఆ రోజంతా అతని చొక్కా సుగంధ పరిమళాన్ని వీస్తూనే ఉంటుంది. ఫైళ్లు చూస్తున్న హెడ్ క్లర్కు ‘అరె! కమలహాసన్ ఫైలు వచ్చినట్లుందే. దాన్ని పైన పెట్టు’ అంటాడు అటెండరుతో. ఫైలు విప్పి చదువుతూ, ‘‘బాబూ! ఆ కమలహాసన్ని పిలువు. ఫైలు మీద కొంత క్లారిఫికేషను కావాలి’’ అంటాడు. కమలహాసన్ వచ్చి సెక్షన్ హెడ్కెదురుగా స్టైలుగా కూర్చుంటాడు. అతని వెంట వచ్చిన సుగంధ పరిమళాలు సెక్షన్ హెడ్ రూమును చుట్టుముడుతాయి. ‘‘నిన్ను పిలిపించానని ఏమనుకోవద్దు కమలహాసన్. నీ ఫైళ్లు వివరంగా విషయం అర్థమయ్యేట్లుంటాయి. పిలిపించింది ఫైలు డిస్కషన్‌కి కాదు. నువ్వు వాడే సెంటు ఎక్కడ దొరుకుతుందో, ఎంతవుతుందో తెలుసుకోవడానికే’’ ముక్కు ఎగబీలుస్తూ అంటాడు సెక్షన్ హెడ్ శంకరయ్య. కమలహాసన్ చిన్నగా దగ్గి, ‘‘ఈ రోజు వాడింది బెనారస్ నుంచి తెప్పించాను. బాటిలు యాభై రూపాయలు’’ అంటాడు. ‘‘అమ్మో. అంతా. ఇంటి అద్దె కొస్తుంది. ఏదో నా సెకండ్ సెటప్‌కి ప్రెజెంట్ చేద్దామనుకున్నా. ఈ జన్మకు జరగని పని’’ నిరాశగా అంటాడు సెక్షన్ హెడ్ శంకరయ్య. నున్నగా ఉన్న గ్రౌండు అంచుల్లో పెరిగిన గడ్డిలా, నెత్తిన నున్నని బట్టతల దాని చుట్టూ చెవులపైన పీచు వెంట్రుకలు ఉన్న శంకరయ్య, ఎవరైనా ఆఫీసుకు అత్తరు అమ్మేవాళ్లు వస్తే, తప్పకుండా పిలిచి బేరం చేసి కొంటుంటాడు. అది ఎందుకు కొంటుంటాడో అప్పుడు అర్థమైంది కమలహాసన్‌కి. ‘‘డోంట్ వర్రీ. వారం రోజుల్లో నేను తెప్పిస్తాను’’ అంటూ కమలహాసన్ అక్కడ నుంచి లేచాడు. శంకరయ్య ముఖం చేటంతయింది. ‘‘చల్లగా ఉండు నాయనా’’ అంటూ అక్కడి నుంచే దీవించాడు. కారణం కమలహాసన్ దాని ఖరీదు తీసుకోడు. అది అతని పాలసీకి వ్యతిరేకం. ఆఫీసరు దగ్గర నుంచి అన్ని ఫైళ్లు వచ్చినా, కమలహాసన్ ఫైలు మాత్రం నిద్ర చేయందే రాదు. కారణం ఆఫీసరే చెబుతాడు. ‘‘నా ఆఫీసు రూమ్‌లో ఎన్ని స్ప్రేలు వాడినా ఎలుకల కంపు మాత్రం పోయేది కాదయ్యా. కమలహాసన్ ఫైళ్లు ఒక రాత్రి నిద్ర చేయడం వల్ల ఆ దరిద్రం పోయి రూము సువాసనలు చిందుతుందయ్యా. ఇంకా కొద్దిసేపు కూర్చోవాలనిపిస్తుంది’’ అంటాడు. ఇలా అటెండరు మొదలుకుని, ఆఫీసరు వరకు ఎవరో ఒకరు ఏదో ఒక సందర్భంలో కమలహాసన్ గురించి మాట్లాడకుండా ఉండలేరు. ఇలా ఉండగా, ఒకరోజు కమలహాసన్ తన చేతిగుడ్డ మరిచిపోయాడు. దాన్ని దాచి పక్కరోజు ఇవ్వబోయిన అటెండరుకు దాన్ని అతన్నే ఉంచుకోమన్నాడు. అదే భాగ్యంగా భావించాడా వ్యక్తి. అది చినిగిపోయేవరకు అతను దాన్ని భద్రంగా జేబులో దాచుకున్నాడు. పరిమళం పోతుందని దాన్ని ఆ మధ్యకాలంలో ఉతకను కూడా లేదు. ఒకరోజు పోస్ట్‌మ్యాన్ ఒక పార్సిలుతో వచ్చాడు. ‘‘ఇక్కడ కె.శ్రీనివాసరావు, ఎల్.డి.క్లర్కు ఎవరండీ?’’ అనడిగాడు. ‘‘ఎవరూ లేరండి’’ అని చెప్పారు ఆఫీసు స్టాఫు. ‘‘ఆఫీసు అడ్రసు ఇదేనే’’ అని గొణుక్కుంటూ వెళ్లిపోయాడు పోస్టుమ్యాన్. మరుసటిరోజు పార్సిలు తీసుకువచ్చిన అదే పోస్టుమ్యాన్, ‘‘ఇక్కడ కమలహాసన్ ఎవరండీ?’’ అని అడిగాడు. ‘‘బి సెక్షనులో ‘ఎ’ క్లర్కు’’ అటెండర్లంతా ఏకకంఠంతో చెప్పారు. అక్కడకు వెళ్లిన పోస్టుమ్యాన్, ‘‘సార్, కమలహాసన్ అంటే మీరేనా?’’ అనడిగాడు. ‘‘అవును.’’ ‘‘కె.శ్రీనివాసరావు మీరేనా?’’ ‘‘అవునవును.’’ ‘‘అనవసరంగా టెన్షన్ పడ్డాను సార్. ఆ టీ కుర్రాడు చెప్పబట్టి సరిపోయింది. లేకపోతే ఆ పార్సిలు పట్టుకుని రోజూ తిరగాల్సొచ్చేది’’ అంటూ పార్సిలు అందించాడు. ‘‘సార్, భుజాల కిందికి వచ్చిన హిప్పీ క్రాఫు, లావు మీసాలు, కింది దాకా వచ్చిన జులపాలు, బెల్‌బాటమ్ ప్యాంటు, బొమ్మల చొక్కా, వెడల్పైన కళ్లద్దాలు. అచ్చం ‘మన్మథ సామ్రాజ్యం’లోని కమలహాసన్లానే ఉన్నారు. నేను కూడా మిమ్మల్ని కమలహాసన్ అనే పిలుస్తాను సార్’’ భయం భయంగా అన్నాడు పోస్టుమ్యాన్. ‘‘ఓకే. గ్రాంటెడ్. అలాగే పిలువు. అలా పిలిస్తేనే నాకు సంతోషం’’ అన్నాడు కమలహాసన్. అలా కమలహాసన్‌తో కలిసి ఐదేళ్లు ఉద్యోగం చేశాం. తరువాత అతనెవరో సెంట్రల్ గవర్నమెంటు ఉద్యోగిని ప్రేమించడం, అటు వాళ్ల తల్లిదండ్రుల్ని, ఇటు వీళ్ల తల్లిదండ్రుల్ని ఒప్పించలేక ఇద్దరూ వీరోచితంగా పెళ్లి చేసుకోవడం, ఇద్దరూ ట్రాన్స్ఫర్ పెట్టుకుని విశాఖపట్నం జిల్లాకు ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్లిపోవడం జరిగింది. అయినా మా మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు, టెలిఫోను సంభాషణలు జరిగేవి. ఎప్పుడో మూడేళ్లకొకసారి, నాలుగేళ్లకొకసారి ఏదో ఒక సందర్భంలో కలుసుకునేవాళ్లం. కాని ఈసారి ఎనిమిదేళ్లు గ్యాపొచ్చింది. మనిషి ఎలా ఉన్నాడో? ఏమో? నేను వెళ్లేసరికి కమలహాసన్ ఇల్లు కోలాహలంగా ఉంది. అతని ఈడు వాళ్లందరం రిటైరైనవాళ్లమే. బట్టతలలు, కళ్లకు చత్వారపు అద్దాలు వచ్చేశాయి. పాత మిత్రుల్ని పరామర్శిస్తున్నా కళ్లు మాత్రం ఈ బట్టతలల మధ్య బండెడు జుట్టుతో మునిగి ఉండే కమలహాసన్ కోసం వెతుకుతున్నాయి. ‘‘అరె అప్పారావ్! ముందు కమలహాసన్ని కలవనివ్వరా?’’ అన్నాను ఎదురొచ్చి షేక్హ్యాండిచ్చిన అప్పారావుతో. ‘‘హాయ్ సుబ్బూ! నేనిక్కడ’’ అంటూ అన్ని బట్టతలల మధ్య ఓ బట్టతల పలుకరించింది. ఏ టూ జెడ్ వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో ఉన్నాడు కమలహాసన్. వైటు బెల్ట్‌తో టక్ చేసి ఉన్నాడు. వైటు బూట్లు. హుందాగా, దర్జాగా, హుషారుగా ఉన్నాడు. కాని బాధాకరమైన విషయం కమలహాసన్ తల నున్నగా హాకీ కోర్టులా ఉంది. నెత్తి మధ్యన మూడే మూడు తెల్ల వెంట్రుకలు రెపరెపలాడుతున్నాయి. ‘‘రేయ్! ఈ వైట్ డ్రెస్ సింగపూర్ నుంచి తెప్పించాన్రా. ఈ రోజు నేను వాడిన ఈ సెంటు ఇంపోర్టెడ్, ఆఫ్గనిస్తాన్ నుంచి తెప్పించాను. ఈ బూట్లు ఎక్కడివనుకున్నావు? లండన్ నుంచి తెప్పించాను’’ చెప్పుకుపోతున్నాడు కమలహాసన్. కళ్లప్పగించి అతని తలవైపు అదే పనిగా చూస్తున్న నా పరిస్థితి అర్థం చేసుకున్నవాడై చిరునవ్వు నవ్వాడు. ‘‘నీ ఫీలింగ్స్ నాకర్థమయ్యాయిరా. ఇప్పటివరకూ వీళ్లందరికీ చెప్పాను. కానీ కాస్త ఆలస్యంగా వచ్చావు కాబట్టి నీకు తెలియదు. అసలు సంగతేమిటంటే వెంట్రుకలు ఊడటం రెండు సంవత్సరాల క్రితం ప్రారంభమైందిరా. కారణం చెబుతాను విను. ఆ రోజు ఒక దినపత్రికలో ఒక ప్రకటన చూశాన్రా. మీ జుత్తు క్రోటను మొక్కలా మొదలై, అంటుకట్టి పెరగాలంటే మా హెయిర్ ఆయిల్ ‘గ్రో... మోర్ గ్రో’ వాడి మీ జుత్తును అంతకు రెండింతలు పెంచుకోండి అని ఉంది. నీకు తెలుసుగదా. కొత్త హెయిర్ ఆయిల్ కనిపిస్తే నేనొదలనని. వెయ్యి రూపాయలు పెట్టి జలంధర్ నుంచి ఆ హెయిర్ ఆయిల్ తెప్పించి వాడానురా. అంతే! వెంట్రుకలు రాలడం మొదలైంది. మందు రాయడం ఆపినా, వెంట్రుకలు రాలడం మాత్రం ఆగలేదు. చివరకు సముద్రంలో రెట్టలా మూడే మూడు వెంట్రుకలు మిగిలాయిరా. వాటినే అల్లారుముద్దుగా చూసుకుంటూ గడుపుతున్నాను. చూసి ఆనందించే నువ్వే నా హిప్పీ జుట్టు పోయినందుకు బాధపడితే, వాటి ఓనర్ని, ఇష్టంగా పెంచుకున్న కమలహాసన్ని నేనెంత బాధపడి ఉంటానో ఊహించుకో’’ అంటూ తన బట్టతల వెనుక ఉన్న విషాదకరమైన కథ చెప్పాడు. నా మనసు వికలమైపోయింది. ఆ రోజు కమలహాసన్ షష్టిపూర్తి మహోత్సవం అద్భుతంగా జరిగింది. అతను, అతని శ్రీమతి కూర్చున్న రాజసింహాసనం లాంటి ఫోమ్ కుర్చీల వెనుక తెరమీద నిండు తలతో భుజాల మీద వేలాడుతున్న హిప్పీ క్రాఫుతో ఉన్న కమలహాసన్ ఫొటో ఉంది, అతని ఒకనాటి వైభవానికి గుర్తుగా. షడ్రసోపేతమైన విందు తరువాత వీడ్కోలు తీసుకుంటుండగా అందరికీ ఖరీదైన బహుమతులిచ్చాడు. నాకు మాత్రం ఒక దంతపు దువ్వెన ఇచ్చాడు. ‘‘ఒరే! సుబ్రావ్. సుబ్బూ. దీన్ని చైనా నుంచి మూడు వేలు పెట్టి తెప్పించాన్రా. జుట్టుమీద మోజు కలిగినవాళ్లు పదే పదే దువ్వినందువల్ల వాటి మొదళ్లు కదిలి క్రమేణా ఊడిపోయి కూడా బట్టతల వస్తుందిరా. ఏ కారణం వల్ల బట్టతల వచ్చినా, బట్టతల ఉన్న ప్రతి ఒక్కరి దగ్గరా తప్పక దువ్వెన ఉంటుంది. ఇది ఈ కమలహాసన్ తెలుసుకున్న సత్యం’’ అంటూ బట్టతల నిమురుకుంటూ నాకు వీడ్కోలిచ్చాడు. నేను ఉలిక్కిపడి ప్యాంటు జేబులోకి చేయి పోనిచ్చి, ఆల్రెడీ జేబులో ఉన్న దువ్వెనను తడుముకున్నాను. కమలహాసన్ సిద్ధాంతం కరెక్టే. మీరెక్కడైనా, ఎప్పుడైనా బట్టతల ఉన్న వ్యక్తిని దువ్వెన అడగండి. తప్పక అతని దగ్గర దువ్వెనుంటుంది! ‘‘రేయ్! ఈ వైట్ డ్రెస్ సింగపూర్ నుంచి తెప్పించాన్రా. ఈ రోజు నేను వాడిన ఈ సెంటు ఇంపోర్టెడ్, ఆఫ్గనిస్తాన్ నుంచి తెప్పించాను. ఈ బూట్లు ఎక్కడివనుకున్నావు? లండన్ నుంచి తెప్పించాను’’ చెప్పుకుపోతున్నాడు కమలహాసన్. ఒకరోజు పోస్ట్‌మ్యాన్ ఒక పార్సిలుతో వచ్చాడు.‘‘ఇక్కడ కె.శ్రీనివాసరావు, ఎల్.డి.క్లర్కు ఎవరండీ?’’ అనడిగాడు.‘‘ఎవరూ లేరండి’’ అని చెప్పారు ఆఫీసు స్టాఫు.‘‘ఆఫీసు అడ్రసు ఇదేనే’’ అని గొణుక్కుంటూ వెళ్లిపోయాడు పోస్టుమ్యాన్. - పోట్లూరు సుబ్రహ్మణ్యం -
పెళ్లికి పిలవండి.. కొత్తగా!
ఆహ్వానం: పెళ్లి...మరువ లేని ఘట్టం. మళ్లీ మళ్లీ తలచుకుని మురిసిపోయే అమూల్య జ్ఞాపకం. కలతలతో నివసించే కపుల్స్ కూడా అలనాటి పెళ్లి ఫొటో చూసినపుడు వారి మొహంపై నవ్వు వెల్లివిరుస్తుంది. మరి అంత గొప్ప అరుదైన ఏకైక సందర్భానికి అందరినీ పిలవాలి కదా... పెళ్లి విశేషాలు చెప్పాలి కదా. మరెలా పిలుస్తున్నారు? గతంలో బంధుమిత్రులు మన ఊళ్లలో చుట్టుపక్కల ఊళ్లలో ... ఇంకా మహా అయితే రాష్ర్ట రాజధానిలో ఉండేవారు. కాబట్టి పిలవడానికి అంత పెద్ద ఇబ్బంది ఉండేది కాదు. ఆ సమయంలో అన్ని ఊళ్లు తిరుగుతూ దాన్ని కూడా ఆనందించేవాళ్లం. ఇపుడు ఆ పరిస్థితి లేదు. పరిచయస్థులు ప్రపంచం మొత్తం ఉంటున్నారు. ఊళ్లూ ఇరుగు పొరుగు మొదలుకొని ఐటీ రంగం పుణ్యమా అని బంధుమిత్రులు దేశ విదేశాల్లో ఉంటున్నారు. మరి వారందరినీ ఎలా పిలవడం? ఎంత మందికని ఫోన్లో అన్ని వివరాలు చెప్పగలం? అందుకే ఏ టెక్నాలజీతో అయితే మన వాళ్లందరూ అంతంత దూరం వెళ్లారో అదే టెక్నాలజీతో వారికి పెళ్లి పిలుపు ఇవ్వాలి. దానికి అత్యుత్తమ మార్గం వెబ్సైట్. వెబ్సైట్ దాకా ఎందుకు ఈ-మెయిల్ ఇన్విటేషను కూడా సరిపోతుందని కొందరు అనుకుంటారు. అది వెడ్డింగ్ కార్డ్ పంపడానికి బానే ఉంటుంది కాని మీరు ఆహ్వాన పత్రిక ఇచ్చేటపుడు మాట్లాడే కబుర్లన్నీ అందులో చెప్పలేరు. అందుకే వెబ్సైట్ ఉత్తమ మార్గం. మరి దానిని ఎలా క్రియేట్ చేయాలి? ఖర్చవుతుందా? ఉపయోగాలేంటి? పెళ్లంటే ముందు చెప్పాల్సింది.. వధువు/వరుడి గురించి. అయితే, ఇదే వెబ్‌సైట్‌ను ఇద్దరూ అందరికీ పంపుతారు కాబట్టి అందులో ఇద్దరి వివరాలు, చదువు, చిన్న ఇంట్రడక్షన్ ఉంటే మంచిది. అందులోనే రెండు కుటుంబాల గురించి ప్రాథమిక వివరాలు రాసుకోవచ్చు. తర్వాత పెళ్లి వేదిక వివరాలు, ఏర్పాట్ల గురించి వివరించొచ్చు. ఫుడ్ మెను అనేది పెళ్లిలో ఎలాగూ ముందే నిర్ణయించుకునేది కాబట్టి దాన్ని కూడా వెబ్సైట్లో పొందుపరుచుకోవచ్చు. అలాగే వివాహం, ముహూర్తం, విందు వివరాలన్నీ ఒకే చోట ఉంటే బాగుంటుంది. ఇక పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ అంతా వస్తారు. అతనేమో అపుడు బిజీగా ఉంటాడు. మరి వచ్చిన ఆ మిత్రులు ఎవర్ని కలవాలి? ఈ వివరాలు కూడా వెబ్సైట్లో పెట్టాలి. వీలైతే మీ నెంబరు కాకుండా మీ ఫ్రెండ్స్‌ను రిసీవ్ చేసుకోవడానికి ఎవరినైనా ఏర్పాటుచేసి వారి ఫొటోలు, ఫోన్ నెంబర్లు వెబ్సైట్లో పెడితే అతిథులకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఏ హోటల్లో ఏ రూములు బుక్ చేసింది... వాటి గూగుల్ మ్యాప్స్ అనుసంధానిస్తే అతిథులకు హాయిగా ఉంటుంది. తర్వాత ఎక్కడెక్కడి నుంచో అతిథులు వస్తుంటారు కదా... మీ ఇంటికి/పెళ్లి మండపానికి ఎలా చేరుకోవాలి, ఏ ఏ రవాణా సదుపాయాలున్నాయో, ఏ సమయంలో ఉన్నాయో చెబితే మంచిది. మీ ఊర్లో దిగాక బస్టాండు నుంచి ఇంటికి/వేదికకు వచ్చే మార్గాన్ని వివరించాలి. ఇవన్నీ పెళ్లికి వచ్చేవారికి. మరి ఎవరికైనా కుదరకపోతే వారు మీకు శుభాకాంక్షలు చెప్పే అవకాశం ఇవ్వాలి కదా... ‘విషెష్ బాక్స్’ కూడా పెడితే ఆనందిస్తారు. వీటితో పాటు మీ ఎంగేజ్మెంట్ ఫొటోలు, షాపింగ్ ఫొటోలు, ఆల్బమ్స్ వంటివి కూడా పెట్టొచ్చు. అనుభవాలు, పెళ్లి గురించి భావాలు కూడా రాసేసుకోవచ్చు. ఎంత ఖర్చవుతుంది? ఇది ఖరీదైన వ్యవహారం కాదు. మీకు తెలిసిన వెబ్ డిజైనర్ ఉంటే 2-3 వేలల్లో అయిపోతుంది. లేదంటే ఫ్రీలాన్స్ డిజైనర్‌ను ఆన్లైన్లో వెతుక్కోవచ్చు. ఉదాహరణకు ‘రాగిణివెడ్స్రాము.కామ్’ అని మీ పెళ్లి సైట్‌కు పేరు పెట్టుకోవచ్చు. సింపుల్‌గా ఆ డొమైన్ నేమ్ వాట్స్యాప్లోనో, ఎస్ఎంఎస్ ద్వారానో చెప్పేయొచ్చు. డబ్బుల్లేకుండా ఉచితంగా పెట్టుకోలేమా అనే వారికి కూడా కొన్ని వేదికలున్నాయి. ఇవే విషయాలను ‘ఒక బ్లాగు’ ఏర్పాటుచేసుకుని అందులో చెప్పొచ్చు. లేదంటే గూగుల్‌కు వెళ్లి ‘క్రియేట్ యువర్ వెడ్డింగ్ వెబ్సైట్’ అనే కీవర్డ్‌తో సెర్చ్ చేస్తే అద్భుతమైన వెడ్డింగ్ టెంప్లేట్స్‌తో ఫ్రీగా మీకు వెబ్సైట్ ఇచ్చే పోర్టల్స్ కూడా ఉన్నాయి. అయితే డొమైన్ నేమ్ కాస్త పెద్దగా ఉంటుంది. -
ఆహ్వానం.. అదిరింది!!
ఆహ్వాన పత్రికల్లో సృజనాత్మకత రోజురోజుకూ వెల్లివిరుస్తోంది. విందుకు ప్రత్యేకంగా ఆహ్వానించాలంటే అరటి ఆకు మోడల్లో కార్డులు వస్తున్నాయి. వాటిమీద మనకు కావల్సిన మేటర్ ప్రింటింగ్ చేయించి పంచపెట్టుకోవచ్చు. ఇప్పుడు ఉపనయనానికి కూడా ఇలా సరికొత్త కార్డులు వచ్చేశాయి. సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా ఉపనయనానికి ఆహ్వానిస్తూ పత్రికలను తయారు చేయిస్తున్నారు. మెడలో యజ్ఞోపవీతం, నుదుట విష్ణునామాలతో ఉపనయనం చేయించుకున్న వటువు రూపంలో ఈ కార్డును రూపొందించారు. హైదరాబాద్ కొత్తపేట గ్రీన్‌హిల్స్ కాలనీలో ఉంటున్న ఆంధ్రాబ్యాంక్ డీజీఎం శేషగిరిరావు.. తన కుమారుడు వెంకటేష్ సాకేత్ ఉపనయనం కోసం ప్రత్యేకంగా ఇలా ఆహ్వాన పత్రికను రూపొందించి తమ బంధు మిత్రులకు పంపారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోని వాళ్ల బంధువులకు చేరిన ఆహ్వానపత్రిక ఇలా ఉంది. ఆసక్తి, అభిరుచి ఉండాలే గానీ.. ఇలా ఎన్నైనా చేయొచ్చని నిరూపించారు.