
బాలీవుడ్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న లవ్ బర్డ్స్ కత్రినా కైఫ్, వీక్కీ కౌశల్ ఎట్టకేలకు వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. నవంబర్ 9న మూడుమూళ్ల సాక్షిగా ఏడడుగులు వేసి అధికారికంగా భార్యభర్తలు అయిపోయారు. రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లోని విలాసవంతమైన హోటల్ సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారా పెళ్లి వేడుకలకు వేదికగా మారింది.
పెళ్లయ్యాక కొత్త జంట రిసెప్షన్‌ను ఘనంగా నిర్వహించనున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా తమ పెళ్లి విషయాన్ని ఈ కపుల్ గోప్యంగానే ఉంచుతున్నారు. ఇక పెళ్లి అనంతరం వీక్కీ, కత్రినాలా వెడ్డింగ్‌కు సంబంధించిన తొలి ఫోటో సోషల్ తాజాగా మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిని ఓ ఫ్యాన్ పేజ్ ఈ ఫోటోను పోస్టు చేసింది. ఇందులో కోటపై భార్యభర్తలుగా నిల్చున్న వీరిద్దరూ చాలా అందంగా కనిపిస్తున్నారు.
చదవండి: నా కల నిజమైంది, లోబో ఎమోషనల్
ఇక బుధవారం సాయంత్రం హల్దీ వేడుక, ఆ తరువాత సంగీత్ నిర్వహించారు. వెడ్డింగ్ ప్లానర్‌లు ముఖ్య అతిథుల కోసం 8 నుంచి 10 టెంట్‌లను బుక్ చేశారట. వీటికి రాత్రికి రూ.70 వేలు ఖర్చవుతుందట.
చదవండి: అమితాబ్ ఇంట్లో అద్దెకు దిగిన కృతి సనన్.. రెంట్ వింటే షాకవుతారు?
Comments
Please login to add a commentAdd a comment