కత్రినాకు కండలవీరుడి సర్‌ప్రైజ్‌ | Birthday Greeting From Salman Khan For Katrina Kaif | Sakshi
Sakshi News home page

కత్రినా కోసం ఆనవాయితీకి బ్రేక్‌

Published Thu, Jul 16 2020 7:08 PM | Last Updated on Thu, Jul 16 2020 7:27 PM

Birthday Greeting From Salman Khan For Katrina Kaif - Sakshi

ముంబై : సహ నటులు, స్నేహితులకు సోషల్‌ మీడియా వేదికగా అరుదుగా బర్త్‌ డే శుభాకాంక్షలు తెలిపే బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ కత్రినా కైఫ్‌ విషయంలో మాత్రం ఆనవాయితీకి భిన్నంగా స్పందించారు. కత్రినా పుట్టిన రోజు సందర్భంగా బుధవారం సల్లూ భాయ్‌ ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ ఆకట్టుకునే ఫోటోతో సోషల్‌ మీడియాలో ఎంట్రీ ఇచ్చారు. వారు కలిసి నటించిన టైగర్‌ జిందా హై మూవీ నుంచి ఓ ఫోటోను పోస్ట్‌ చేసి హ్యాపీ బర్త్‌డే కత్రినా అని రాశారు. దిల్‌ దియా గలన్‌ అనే పాటలోని స్టిల్‌ను ఈ ఫోటో కోసం సల్మాన్‌ ఎంచుకున్నారు.

37వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన కత్రినా కైఫ్‌కు బాలీవుడ్‌ సహచరుల నుంచి సోషల్‌మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కత్రినా ప్రస్తుతం తన సోదరి ఇసాబెల్లెతో కలిసి ముంబై నివాసంలో క్వారంటైన్‌లో ఉన్నారు. సల్మాన్‌, కత్రినా కలిసి గతంలో ఏక్‌ థా టైగర్‌, టైగర్‌ జిందా హై, మైనే ప్యార్‌ కోం కియా, యువ్‌రాజ్‌, భారత్‌ వంటి పలు చిత్రాల్లో సిల్వర్‌ స్క్రీన్‌పై మెరిశారు. ఇక కత్రినా తన తర్వాతి సినిమాలో బాలీవుడ్‌ ఖిలాడీ అక్షయ్‌ కుమార్‌ సరసన నటించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement