ఇంటర్వెల్‌ లేని సినిమాలో కత్రినా కైఫ్‌ | Katrina Kaif New Movie Name Merry Christmas | Sakshi
Sakshi News home page

90 నిమిషాల థ్రిల్లర్ మూవీలో కత్రినా కైఫ్‌

Feb 25 2021 8:53 AM | Updated on Feb 25 2021 12:29 PM

Katrina Kaif New Movie Name Merry Christmas - Sakshi

‘అంధా ధున్‌’ దర్శకుడు శ్రీరామ్‌ రాఘవన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకె క్కనుంది...

‘మెర్రీ క్రిస్మస్‌’ అంటున్నారు కత్రినా కైఫ్‌. అప్పుడే క్రిస్మస్‌ ఏంటి? అంటే కత్రినా నటించనున్న  తాజా చిత్రానికి ‘మెర్రీ క్రిస్మస్‌’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. విజయ్‌ సేతుపతి హీరోగా, కత్రినా కైఫ్‌ హీరోయిన్‌గా ‘అంధా ధున్‌’ దర్శకుడు శ్రీరామ్‌ రాఘవన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఏప్రిల్‌లో ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాకు ‘మెర్రీ క్రిస్మస్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. థ్రిల్లర్‌ జానర్‌లో ఈ చిత్రాన్ని 90 నిమిషాల నిడివితో తెరకెక్కించాలనుకుంటున్నారు. ఈ సినిమాకు ఇంటర్వెల్‌ ఉండకపోవడం ఓ విశేషం. ఏప్రిల్‌లో పుణేలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం అవుతుంది.  30 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేయాలనుకుంటున్నారు. ఈ ఏడాది చివర్లో ‘మెర్రీ క్రిస్మస్‌’ను థియేటర్లోకి తీసుకురావాలనుకుంటోంది చిత్రబృందం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement