
ముంబై : భారత్‌లో కరోనా మహమ్మారి కోరలు చాస్తుంది. ఇప్పటికే పలువురు బీటౌన్ సెలబ్రిటీలందరూ వరుసపెట్టి మహమ్మారి గుప్పిట్లో చిక్కుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 'నాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నాను. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. వైద్యుల సలహాలు పాటిస్తున్నాను.
గత కొన్ని రోజులుగా నన్ను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోండి. జాగ్రత్తలు పాటించండి' అని కత్రినా పేర్కొన్నారు. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పలువురు ప్రముఖులు సహా నెటిజన్లు ట్వీట్ చేశారు. కాగా టాప్ స్టార్స్ అంతా వరుసగా కరోనా బారిన పడుతుండటంతో బాలీవుడ్‌లో టెన్షన్ నెలకొంది. ఇప్పటికే.. ఆమీర్ ఖాన్, రణ్‌బీర్ కపూర్, మలైకా అరోరా, ఆలియా భట్, అక్షయ్ కుమార్ సంజయ్ లీలా భన్సాలీ, మనోజ్ బాజ్‌పాయ్, దంగల్ నటి పాతిమా సనా షేక్ వంటి వారికి కరోనా పాజిటివ్ అని తేలింది.
చదవండి : బీటౌన్‌లో కరోనా ప్రకంపనలు..
కరోనా పాజిటివ్: ఆస్పత్రిలో చేరిన అక్షయ్
Comments
Please login to add a commentAdd a comment