
Vijay Sethupathi Katrina Kaif: నటుడు విజయ్ సేతుపతి బాలీవుడ్ అందాల భామ కత్రినా కైఫ్‌తో కలిసి మేరీ క్రిస్మస్‌కు సిద్ధమయ్యారు. ఈయన బహుబాషా నటుడు అన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కోలీవుడ్, టాలీవుడ్‌లో తన సత్తా చాటిన ఈయన ఇప్పుడు బాలీవుడ్‌నూ పాగా వేసే ప్రయత్నం చేస్తున్నారు. అలా అక్కడ ఏకంగా అందాల రాణి కత్రినా కైఫ్‌తో జోడీ కడుతున్నారు. 'మేరీ క్రిస్మస్' అనే చిత్రంలో ఈ జంట కలిసి నటిస్తున్నారు. ఈ విషయాన్ని నటి కత్రినా కైఫ్ స్వయంగా తన ఇన్ స్ట్రాగామ్‌లో పేర్కొన్నారు.
ఇంతకు ముందు ఏజెంట్ వినోద్ బద్లాపూర్, అందాదూన్ వంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు శ్రీరామ్ రాగవన్ దర్శకత్వంలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ఆయన దర్శకత్వంలో నటించాలని చాలా కాలంగా కోరుకుంటున్నానన్నారు. కథను థ్రిల్లింగ్‌గా రూపొందించడంలో ఆయన మాస్టర్ అని పేర్కొన్నారు. ఇందులో నటుడు విజయ్ సేతుపతితో కలిసి నటించడానికి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment