అర్థరాత్రి ముసుగులో కత్రినా ఇంటికి హీరో! | Vicky Kaushal Gets Clicked Arriving At Katrina Kaif Residence In Mumbai | Sakshi
Sakshi News home page

అర్థరాత్రి కత్రినా ఇంటికి విక్కీ.. ఏదో ఉంది!

Published Mon, Aug 10 2020 12:47 PM | Last Updated on Mon, Aug 10 2020 2:59 PM

Vicky Kaushal Gets Clicked Arriving At Katrina Kaif Residence In Mumbai - Sakshi

ముంబై: బాలీవుడ్‌ బ్యూటీ కత్రినా కైఫ్‌, యువహీరో విక్కీ కౌశ‌ల్‌ మధ్య ఏదో ఉందనే వార్తలు చాలా రోజులుగా వస్తూనే ఉన్నాయి. ఒకానొక టైమ్‌లో ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను విక్కీ తోసిపుచ్చారు. తాను సింగిల్‌లే అంటూ క్లారిటీ ఇచ్చాడు. అయినప్పటికీ  విక్కీ కత్రినాతో మింగిల్ అవుతూనే ఉన్నాడని బీటౌన్‌ కోడై కూస్తోంది. అది నిజమే అనేలా అప్పుడప్పుడు వీరి ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. తమ ప్రేమాయణాన్ని ఎంత గోప్యంగా ఉంచాలనుకున్నా కూడా  ఏదో రకంగా బయటికి వస్తూనే ఉంది. (చదవండి : ఆయుష్మాన్‌పై కంగ‌న ఫైర్)

తాజాగా అర్థరాత్రి వేళ ముసుగు వేసుకొని కత్రినా ఇంటికి వెళ్లిన విక్కీ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. తలకు క్యాప్‌, ముఖానికి మాస్క్‌, చేతులకు గ్లౌజు ధరించిన విక్కీ.. ఆదివారం రాత్రి ముంబైలోని కత్రినా ఇంట్లో ప్రత్యక్షమయ్యాడు. ఎవరి కంటా పడకుండా హడావిడిగా కారు దిగి లోపలికి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈ ఫోటోలతో వీరిద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ ఉందనే వాదనకు మరింత బలం చేకూరినట్లైంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement