Vicky’s Cousin Upasana Vohra Interesting Comments on Katrina Kaif - Sakshi
Sakshi News home page

Katrina Kaif-Vicky Kaushal: కత్రినాపై విక్కీ కౌశల్‌ కజిన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Published Wed, Dec 15 2021 12:24 PM | Last Updated on Wed, Dec 15 2021 12:48 PM

Vicky Kaushal Cousin Interesting Comments On Katrina Kaif And Her Family - Sakshi

విక్కీ కౌశల్‌ కజిన్‌ ఉపాసన వోహ్రా కత్రినా కైఫ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇటీవల సోషల్‌ మీడియాలో లైవ్‌చాట్‌ నిర్వహించిన ఆమె కత్రినా-విక్కీల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ సందర్భంగా సోషల్‌ మీడియా యూజర్ల నుంచి వచ్చిన పలు ప్రశ్నలకు ఉపాసన ఓహ్ర ఓపికగా సమాధానం ఇచ్చింది. ఈ నేపథ్యంలో కత్రినా కుటుంబం ఎలా ఉందని అడగ్గా.. తన కుటుంబ సభ్యులంతా చాలా బాగున్నారని, వారిది అద్భుతమైన వ్యక్తిత్వం’ అని చెప్పింది.

చదవండి: నుదుటిన సింధూరం.. తాళి బొట్టుతో చూడ ముచ్చటగా కత్రినా, ఫొటోలు వైరల్‌

కత్రినా పంజాబీ మాట్లాడుతుందా? అని మరో నెటిజనల్‌ ప్రశ్నించగా.. ‘తను చాలా బాగా పంజాబీ మాట్లాడుతుంది. పెళ్లిలో విక్కీతో పాటు మా కుటుంబ సభ్యులతో కూడా కత్రినా పూర్తిగా పంజాబీలోనే మాట్లాడింది. అతి తక్కువగా ఇంగ్లీష్‌లో మాట్లాడేది. ఈ క్రమంలో తనతో మాకు బాగా చనువు ఏర్పడింది. ఇక అందరి పేర్లను క్యాట్‌ చాలా బాగా గుర్తుపెట్టుకుంది. ఆ మూడు రోజుల మేమంత ఒమేమంతా ఒక ఫ్యామిలీలా కలిసిపోయాం’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్ జిల్లా సిక్స్ సెన్సెస్ కోట, బర్వారాలో డిసెంబర్‌ 9న కత్రినా, విక్కీ వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. 

చదవండి: ఎయిర్‌పోర్టు దాడి: విజయ్‌ సేతుపతికి కోర్టు సమన్లు

కాగా హాంకాంగ్‌లో పుట్టిన కత్రినా కైఫ్‌ లండన్‌లో పెరిగింది. కాబట్టి ఆమె మదర్ టంగ్ ఇంగ్లీష్‌. అయితే బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాక హిందీ నేర్చుకున్న కత్రినా మీడియా ముందు, ఇంటర్వ్యూల్లో చాలా వరకు హిందీ, ఇంగ్లిష్ భాషల్లోనే మాట్లాడుతుంది. ఇక భర్త విక్కీ కౌశల్‌ పంజాబీ కుటుంబానికి చెందిన వాడు కావడంతో క్యాట్‌ పంజాబీ భాషను నేర్చుకుందట. కాగా రాజస్థాన్‌లో వివాహం అనంతరం కత్రినా కైఫ్‌- విక్కీ కౌశల్‌ దంపతులు నిన్న(డిసెంబర్‌ 14) తిరిగి ముంబైకి వచ్చిన సంగతి తెలిసిందే. పెళ్లికి ముందు వరకు తమ ప్రేమబంధంపై ఎంతో గోప్యత పాటించిన ఈ నవ దంపతులు ముంబై ఎయిర్‌ పోర్టులో ఒకరిచేయి ఒకరు పట్టుకుని మరీ కెమెరాలకు స్టిల్‌ ఇచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement