![Katrina Kaif Recalls Near Death Experience - Sakshi](/styles/webp/s3/article_images/2023/11/25/Katrina-Kaif-01.jpg.webp?itok=wRlVTyhd)
బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ ఓసారి చావు అంచులదాకా వెళ్లి వచ్చిందట. ఆ సమయంలో తను బతుకుతానని ఊహించలేదని, చావు తథ్యమని బయపడిపోయిందట. కత్రినా మాట్లాడుతూ.. ఓసారి నేను గగనప్రయాణం చేస్తున్నాను. అప్పుడు ఉన్నట్లుండి హెలికాప్టర్‌లో ఏదో ఇబ్బంది తలెత్తి ఆగిపోయింది. అంతా అల్లకల్లోలంగా మారింది. హెలికాప్టర్ వేగంగా నేలవైపు దూసుకెళ్లింది. ఇక అప్పుడే నేను చావు ఖాయమని ఫిక్సయిపోయాను.
దేవుడా.. నా చావును ఇలా రాశావేంటి? అనుకున్నాను. ఆ క్షణమే నా జీవితం ముగిసిపోయిందనుకున్నాను. నాకేం జరిగినా మా అమ్మ తట్టుకోగలగాలని మాత్రమే కోరుకున్నాను అని చెప్పుకొచ్చింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో కత్రినా స్వల్ప గాయాలతో బయటపడింది. కాగా కత్రినా సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన టైగర్ 3 సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీ బాక్సాఫీస్ మీద వందల కోట్ల కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో మేరీ క్రిస్‌మస్ మూవీ ఉంది. ఇందులో విజయ్ సేతుపతి హీరోగా నటించాడు. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది.
చదవండి: ఓవర్ కాన్ఫిడెన్స్‌తో చేతులారా చేసుకుంది.. చివరకు ఎలిమినేట్.. రతిక కూడా?
Comments
Please login to add a commentAdd a comment