Katrina Kaif Cute Birthday Wishes To Husband Vicky Kaushal, See Pics - Sakshi
Sakshi News home page

Katrina Kaif-Vicky Kaushal: భర్తకు కత్రీనా స్వీటెస్ట్‌ బర్త్‌డే విషెస్‌

Published Mon, May 16 2022 2:49 PM | Last Updated on Mon, May 16 2022 3:28 PM

Katrina Kaif Cute Birthday Wishes To Husband Vicky Kaushal - Sakshi

Katrina Kaif Sweetest Birthday Wishes To Hubby Vicky Kaushal: బాలీవుడ్‌ హీరో విక్కీ కౌశల్‌ బర్త్‌డే సందర్భంగా ఆయన భార్య, హీరోయిన్‌ కత్రీనా కైఫ్‌ స్పెషల్‌ బర్త్‌డే విషెస్‌ తెలిపింది. ప్రస్తుతం ఈ స్టార్‌ కపుల్‌ అమెరికాలో వేకేషన్‌ను ఎంజాయ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం (మే 16) వి​క్కీ కౌశల్‌ బర్త్‌డే సందర్భంగా అతడికి సినీ ప్రముఖులు, ఫ్యాన్స్‌ నుంచి సోషల్‌ మీడియాల్లో శుభాకాంక్షలు వెళ్లువెత్తున్నాయి. అలాగే పెళ్లి అనంతరం విక్కీ తొలి బర్త్‌డే సందర్భంగా కత్రీనా భర్తకు స్వీటెస్ట్‌ బర్త్‌డే విషెస్‌ తెలిపింది. 

చదవండి: ఆమిర్‌ ఖాన్‌ ఎదుటే బికినీలో బర్త్‌డే పార్టీ, ట్రోలర్స్‌ నోర్మూయించిన ఐరా

నేపథ్యంలో భర్తతో క్లోజ్‌గా ఉన్న ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ.. ‘న్యూయార్క్‌ వాలా బర్త్‌డే మై లవ్‌.. ఏ విషయాన్నైనా నువ్వు ఉత్తమమైనదిగా చేస్తావు..’ అంటూ రాసుకొచ్చింది. ఈ ఫొటోలో విక్కీ కౌశల్‌, కత్రీనాను వెనకనుంచి హగ్‌ చేసుకుని ఆమెకు ముద్దు పెడుతూ కనిపించాడు. ఇక కత్రీనా పోస్ట్‌ చూసిన ఈ జంట ఫ్యాన్స్‌ తెగ మురిసిపోతున్నారు. ఈ జంటపై అభిమానం కురిపిస్తూ విక్కీకి బర్త్‌డే విషెస్‌ తెలుపుతున్నారు నెటిజన్లు.

చదవండి: 'ఖుషి' టైటిల్‌తో వస్తున్న విజయ్‌, సామ్‌

కాగా గతేడాది రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్ జిల్లా సిక్స్ సెన్సెస్ కోట, బర్వారాలో డిసెంబర్‌ 9న కత్రినా, విక్కీ వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా సీక్రెట్‌గా డేటింగ్‌లో ఉన్నారు. ఎప్పుడు ఈ జంట మీడియా ముందు బయట పడలేదు. ఎక్కడికి వెళ్లిన రహస్యంగా వెళ్లే ఈ జంట మీడియా ముందు మాత్రం దూరం పాటించేవారు. అలా పెళ్లి వరకు వీరి రిలేషన్‌ను గోప్యంగా ఉంచారు విక్ట్రీనా. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement