
Katrina Kaif And Vicky Kaushal's Pre-Wedding Photoshoot: బాలీవుడ్ జంట కత్రినా కైఫ్, విక్కీ కౌశల్‌ని వివాహం ప్రస్తుతం బాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. కొన్నేళ్లుగా డేటింగ్‌లో ఉన్న విక్కీ, కత్రినా డిసెంబర్ 9న పెద్దల సమక్షంలో వివాహ బంధంతో ఒకటయ్యారు. రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్ జిల్లా సిక్స్ సెన్సెస్ కోట, బర్వారాలో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ప్రస్తుతం కత్రినా పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.
కాగా పెళ్లి అయ్యే వరకు వీరి వివాహం గురించి గోపత్య పాటించిన ఈ జంట పెళ్లి తరువాత వరుస పెట్టి ఫోటోలు షేర్ చేస్తున్నారు. ముందుగా పెళ్లి, తరువాత హల్దీ, సంగీత్.. తాజాగా ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్‌కు సంబంధించిన ఫోటోలను విక్కీ, కత్రినా ఇద్దరూ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఫోటోల్లో సెలెబ్రిటీ డిజైనర్ సభ్యసాచి ప్రత్యేకంగా రూపొందించిన దుస్తుల్లో నూతన జంట మెరిసిపోతున్నారు. ఇద్దరూ బేబి పింక్ కలర్ మ్యాచింగ్ కాస్టూమ్స్‌తో ఫర్‌ఫెక్ట్ లుక్స్‌తో కనిపిస్తున్నారు. ఒకరి చేయి ఒకరు పట్టుకోవడం, కత్రినా నుదిటిపై విక్కీ ముద్దు పెడుతున్న పిక్స్ ఎంతో రొమాంటిక్‌గా కనిపిస్తున్నాయి.
చదవండి: వైరల్ అవుతోన్న విక్ట్రీనా వెడ్డింగ్ రిసెప్షన్ హాంపర్, అందులో ఏం ఉన్నాయంటే..
ఈ ఫోటోలను షేర్ చేస్తూ... ఓ అందమైన కొటేషన్‌ను కూడా పోస్టు చేశారు. ‘మా మనసులో ఒకరి పట్ల మరొకరికి ఉన్న ప్రేమ, కృతజ్ఙత మమ్మల్ని ఇంతదాకా తీసుకువచ్చింది. మా ఈ కొత్త ప్రయాణానికి అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరుతున్నాం’ అంటూ పేర్కొన్నారు. ఈ ఫోటోలు అభిమానులు, నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ‘ఎంతో అందంగా, చూడముచ్చటగా, మేడ్ ఫర్ ఇచ్ అదర్ అనేలా ఉన్నారు. జీవితాంతం ఇలాగే సంతోషంగా ఉండాలి’ అంటూ కపుల్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
చదవండి: భార్యభర్తలుగా కత్రినా కైఫ్, విక్కీ కౌశల్.. వైరలవుతోన్న వెడ్డింగ్ ఫోటోలు..




Comments
Please login to add a commentAdd a comment