pre-wedding shoot pictures
-
విక్కీ, కత్రినా ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్.. రొమాంటిక్ లుక్‌లో మెరిసిపోతున్న క్యూట్ కపుల్
Katrina Kaif And Vicky Kaushal's Pre-Wedding Photoshoot: బాలీవుడ్ జంట కత్రినా కైఫ్, విక్కీ కౌశల్‌ని వివాహం ప్రస్తుతం బాలీవుడ్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. కొన్నేళ్లుగా డేటింగ్లో ఉన్న విక్కీ, కత్రినా డిసెంబర్ 9న పెద్దల సమక్షంలో వివాహ బంధంతో ఒకటయ్యారు. రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్ జిల్లా సిక్స్ సెన్సెస్ కోట, బర్వారాలో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ప్రస్తుతం కత్రినా పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. కాగా పెళ్లి అయ్యే వరకు వీరి వివాహం గురించి గోపత్య పాటించిన ఈ జంట పెళ్లి తరువాత వరుస పెట్టి ఫోటోలు షేర్ చేస్తున్నారు. ముందుగా పెళ్లి, తరువాత హల్దీ, సంగీత్.. తాజాగా ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్‌కు సంబంధించిన ఫోటోలను విక్కీ, కత్రినా ఇద్దరూ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఫోటోల్లో సెలెబ్రిటీ డిజైనర్ సభ్యసాచి ప్రత్యేకంగా రూపొందించిన దుస్తుల్లో నూతన జంట మెరిసిపోతున్నారు. ఇద్దరూ బేబి పింక్ కలర్ మ్యాచింగ్ కాస్టూమ్స్‌తో ఫర్ఫెక్ట్ లుక్స్‌తో కనిపిస్తున్నారు. ఒకరి చేయి ఒకరు పట్టుకోవడం, కత్రినా నుదిటిపై విక్కీ ముద్దు పెడుతున్న పిక్స్ ఎంతో రొమాంటిక్‌గా కనిపిస్తున్నాయి. చదవండి: వైరల్ అవుతోన్న విక్ట్రీనా వెడ్డింగ్ రిసెప్షన్ హాంపర్, అందులో ఏం ఉన్నాయంటే.. ఈ ఫోటోలను షేర్ చేస్తూ... ఓ అందమైన కొటేషన్‌ను కూడా పోస్టు చేశారు. ‘మా మనసులో ఒకరి పట్ల మరొకరికి ఉన్న ప్రేమ, కృతజ్ఙత మమ్మల్ని ఇంతదాకా తీసుకువచ్చింది. మా ఈ కొత్త ప్రయాణానికి అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరుతున్నాం’ అంటూ పేర్కొన్నారు. ఈ ఫోటోలు అభిమానులు, నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ‘ఎంతో అందంగా, చూడముచ్చటగా, మేడ్ ఫర్ ఇచ్ అదర్ అనేలా ఉన్నారు. జీవితాంతం ఇలాగే సంతోషంగా ఉండాలి’ అంటూ కపుల్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. చదవండి: భార్యభర్తలుగా కత్రినా కైఫ్, విక్కీ కౌశల్.. వైరలవుతోన్న వెడ్డింగ్ ఫోటోలు.. View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) View this post on Instagram A post shared by Vicky Kaushal (@vickykaushal09) -
అంకిత లోఖండే ప్రి-వెడ్డింగ్ వేడుకలు.. ఫొటోలు వైరల్
Ankita Lokhande Pre Wedding Celebrations And Photos Viral: బాలీవుడ్ నటి, దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ ప్రేయసి అంకిత లోఖండే త్వరలో వివాహం చేసుకోనుంది. ముంబైలో తన ప్రియుడు విక్కీ జైన్‌తో పెళ్లి పీటలు ఎక్కనుంది. ఈ విషయాన్ని విక్కీ తన ఇన్‌స్టా గ్రామ్‌లో వారి ప్రీ-వెడ్డింగ్ వేడుకల్లోని ఫొటోలను షేర్ చేసుకున్నాడు. ఈ ఫొటోలో వధువు పింక్, గోల్డెన్ బార్డర్‌తో గ్రీన్ కలర్ సారీలో కనిపిస్తుంది. అంకిత కొన్ని సాంప్రదాయ ఆభరణాలను ధరించడం మనం చూడొచ్చు. మరోవైపు విక్కీ జైన్ ఆఫ్-వైట్ కుర్తా వేసుకున్నాడు. అంకిత కూడా 'పవిత్రం' అని క్యాప్షన్ ఇస్తూ ఒక ఫొటోను సోషల్ మీడియాలో పంచుకుంది. View this post on Instagram A post shared by Ankita Lokhande (@lokhandeankita) ఈ పోస్ట్‌లపై పలువురు ప్రముఖులు కామెంట్ బాక్స్‌లో హార్ట్ ఎమోజీస్‌తో తమ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వారం ప్రారంభంలో సన్నిహితుల మధ్య ఈ వేడుకలు జరుపుకున్నారు. వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంకిత, విక్కీ కొన్ని రోజుల క్రితం వారి వెడ్డింగ్ కార్డ్స్ కూడా పంచినట్లు సమాచారం. నవంబర్‌లో అంకిత తన ఫ్రెండ్స్ కోసం బ్యాచిలొరెట్ పార్టీ ఇచ్చిందని తెలుస్తోంది. ఈ జంట డిసెంబర్ 12, 13, 14 తేదిల్లో వివాహం చేసుకోనున్నట్లు పుకార్లు జోరందుకున్నాయి. అయితే ఇప్పటివరకు అధికారికంగా ధ్రువీకరించలేదు. View this post on Instagram A post shared by Vicky Jain (@jainvick) ఇండోర్‌లో జన్మించిన అంకిత 2005లో తన నటన కలను సాకారం చేసుకోడానికి ముంబైకి వచ్చింది. తన టాలెంట్ నిరూపించుకునేందుకు 'టాలెంట్ హంట్ రియాలిటీ షోలో పాల్గొంది. నాలుగేళ్ల తర్వాత 'పవిత్ర రిష్టా' టీవి సీరియల్‌తో పెద్ద బ్రేక్ వచ్చింది. ఈ సీరియల్‌తో పరిచయమైన సుశాంత్ సింగ్‌తో డేటింగ్ చేస్తున్నట్లు 2019లో అంకిత ప్రకటించింది. తర్వాత సుశాంత్‌తో ఆరేళ్ల పాటు రిలేషన్షిప్లో ఉంది. కంగనా రనౌత్ నటించిన 'మణికర్ణిక'తో సినిమాల్లోకి అడుగుపెట్టింది అంకిత. తర్వాత 'బాఘీ 3' చిత్రంలో కూడా నటించింది. -
ఈ పెళ్లి ఫోటోలను చూస్తే.. మీరు ఇలాగే ప్రయత్నిస్తారు!
సాధారణంగా వివాహానికి ముందు, వివాహ సమయంలో జంటలు ఫోటోలు దిగుతుంటారు. వాటిని తీసే ఫోటోగ్రాఫర్లు కొన్ని స్టాండ్లు, లైట్లను ఉపయోగించి తీస్తుండటం చూసుంటారు. కానీ, ఫోటోలను తీయడం కోసం చిత్ర విచిత్రమైన పొజిషన్లను మారుస్తూ కొంతమంది ఫోటోగ్రాఫర్లు ఓ జంటకు చేసిన ప్రీ వెడ్డింగ్ షూట్ ఫోటోలు ప్రస్తుతం ఆన్ లైన్ లో వైరల్ అయ్యాయి. రోజూ కనిపించే సాధారణ ప్రాంతాల్లోనే ఎక్కువశాతం ఫోటోలు తీసిన వీరి ఆలోచనల్లోని సృజనాత్మకత ఫోటోలు వచ్చిన తర్వాత బయటపడింది. దాదాపు ప్రకృతిలోని అన్ని వనరులను వాడుకుంటూ చేసిన ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ ఫోటోలను ఒకసారి తిలకించారంటే మీకు కూడా ఇలానే షూట్ చేయాలనిపించక మానదు.