Katrina kaif and Vicky kaushal had roka ceremony on diwali - Sakshi
Sakshi News home page

Katrina Kaif: డిసెంబర్‌లో పెళ్లి.. 'రోకా' ఫంక్షన్‌ కూడా అయిపోయింది!..

Published Mon, Nov 8 2021 7:53 AM | Last Updated on Mon, Nov 8 2021 11:44 AM

Katrina Kaif And Vicky Kaushal Had Roka Ceremony On Diwali Day - Sakshi

Katrina Kaif And Vicky Kaushal Had Roka Ceremony : ఇటీవల దీపావళి పండగతో పాటు అదే రోజున విక్కీ కౌశల్, కత్రినా కైఫ్‌ల జీవితాల్లో మరో వేడుక కూడా జరిగిందని బాలీవుడ్‌ టాక్‌. ఆ వేడుక ఏంటంటే ‘రోకా’. పెళ్లికి ముందు జరిగే వేడుకల్లో ఇదొకటి. నిశ్చితార్థం ఎప్పుడు చేసుకోవాలి? పెళ్లి ముహూర్తం, వేదిక, విందు వంటి విషయాలు మాట్లాడుకోవడానికి అబ్బాయి–అమ్మాయి తరఫు కుటుంబ సభ్యులు ఒకచోట కలిసి మాట్లాడుకోవడమే ‘రోకా’ ఫంక్షన్‌. ఉత్తరాదిన ఈ సంప్రదాయాన్ని ఆచరిస్తారు.

దీపావళి రోజు కత్రినా–విక్కీ కుటుంబ సభ్యులు ఇవే మాట్లాడుకున్నారట. దర్శకుడు కబీర్‌ ఖాన్‌ ఇంట్లో ఈ వేడుక జరిగిందట. కబీర్‌ దర్శకత్వంలో ‘న్యూయార్క్‌’, ‘ఏక్‌ థా టైగర్‌’ చిత్రాల్లో నటించారు కత్రినా. ఆయన్ను సోదరుడిలా భావిస్తారు. అందుకే రోకా వేడుకకు ఆయన ఇల్లు వేదిక అయిందట.


కొంత కాలంగా ప్రేమలో ఉన్న విక్కీ–కత్రినాల పెళ్లికి వేళయిందని, డిసెంబర్‌లో ఈ జంట పెళ్లి పీటల మీద కూర్చుంటారని బాలీవుడ్‌ అంటోంది. మరి.. ఇయర్‌ ఎండింగ్‌లో విక్కీ బ్యాచిలర్‌ లైఫ్‌కి, కత్రినా బ్యాచిలరెట్‌ లైఫ్‌కీ ఎండ్‌ కార్డ్‌ వేస్తారా? వేచి చూడాలి. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement