ముంబై: హీరోయిన్ నయనతారను ఎ ఫైటర్ అంటూ బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ ఆమెపై ప్రశంసల జల్లు కురిపించారు. కత్రినా మేకప్ బ్రాండ్ ‘కే’(kay)కు నయనతార బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కే(kay) ప్రచార ప్రకటనలో భాగంగా నయన్ ఇటీవల ముంబై వెళ్లిన విషయం తెలిసిందే. తన మేకప్ బ్రాండ్ ప్రకటన కోసం నమనతార సమయాన్ని కేటాయించినందుకు గురువారం కత్రినా సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు. ‘సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతారకు పెద్ద ధన్యవాదాలు. మీ బీజీ షేడ్యూల్‌లో కూడా ముంబై వచ్చి మా మేకప్ బ్రాండ్ ప్రకటనకు మీ సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు. మీ ఉదారతకు.. అందానికి ఎప్పటికీ సలాం’ అంటూ తన ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. (అప్పుడు దూరాన్ని తరిమేద్దాం)
అంతేగాక ఓ ఇంటర్య్వూలో కత్రినాను.. నయనతారతో కలిసి పనిచేసిన అనుభవం గురించి అడగ్గా.. ‘‘తన అద్భుత నటన, తన సంకల్పం చూసి ఆశ్చర్యపోయాను. తను ఓ ఫైటర్. పోరాట యోధురాలిగా కనిపిస్తుంది. ఆమెలో ఏదో ప్రత్యేకత ఉంది. అంతేగాక తను చేసే పనికి కట్టుబడి ఉంటుంది. తను చాలా చిన్న వయస్సు నుంచే నటిస్తున్నారు. అంతేకాదు అద్భుత నటి కూడా. అయినప్పటికీ నిరాడంబరంగా ఉంటారు. అది నన్ను చాలా ఆకర్షించింది’’ అటూ చెప్పుకొచ్చారు. కాగా ఇటీవల సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన దర్భార్ నటిచంని నమయనతార ప్రస్తుతం విజయ్ సేతుపతితో కలిసి తమిళ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం కత్రినా అక్షయ్ కుమార్‌తో సూర్యవంశీ సినిమాలో నటిస్తున్నారు. (ఆగస్ట్‌లో ఆరంభం)
Comments
Please login to add a commentAdd a comment