Police Held A Man Who Death Threat to Katrina Kaif and Vicky Kaushal - Sakshi
Sakshi News home page

Katrina Kaif-Vicky Kaushal: ‘కత్రినా నా భార్య’ అంటూ వీడియోలు, ఫొటోలు.. నిందితుడి అరెస్ట్‌

Published Mon, Jul 25 2022 5:55 PM | Last Updated on Mon, Jul 25 2022 9:53 PM

Police Held A Man Who Death Threat to Katrina Kaif and Vicky Kaushal - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ కత్రినా కైఫ్‌-విక్కీ కౌశల్‌ను సోషల్‌ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని తాజాగా ముంబై పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుడిని మన్వీందర్‌ సింగ్‌గా గుర్తించారు. కాగా ఇతను కూడా సినిమా రంగంలో అవకాశాల కోసం వెతుకుతున్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది. మన్వీందర్‌ సింగ్‌.. కత్రినాకు వీరాభిమాని. ఆమెను పెళ్లి చేసుకోవాలని కలలు కన్నాడట. అయితే గతేడాది కత్రినా విక్కీతో పెళ్లిపీటలెక్కడంతో అతను నిరాశకు లోనయ్యాడు.

చదవండి: మరోసారి ఉలిక్కి పడ్డ బాలీవుడ్‌.. కత్రీనాను చంపేస్తామంటూ బెదిరింపులు

ఈ నేపథ్యంలో కత్రినా దంపతులను చంపేస్తామంటూ సోషల్‌ మీడియా వేదికగా గత కొన్ని నెలలుగా బెదిరిస్తున్నాడు. అయితే ఈ బెదిరింపులు మరీ ఎక్కువ కావడంతో కత్రినా దంపతులు పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. వారి ఫిర్యాదు మేరకు సెక్షన్ 506(2), 354(డి) ఐపీసీ సెక్షన్ 67 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు అనుమానితుడిగా ఉన్న మన్వీందర్‌ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా నిందితుడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో కత్రినాతో పాటు ఇతర బాలీవుడ్‌ హీరోయిన్ల ఎడిటెడ్‌ ఫొటోలు, వీడియోలు ఉండడం గమనార్హం. అందులో కత్రినాతో తనకు వివాహమైనట్లు ఇద్దరి ఫొటోలను ఎడిట్‌ చేసి ఓ వీడియోను కూడా షేర్‌ చేశాడు. 

చదవండి: క‌ద‌ల‌లేని స్థితిలో కైకాల‌, బెడ్‌పైనే కేక్ క‌ట్ చేయించిన చిరు.. ఫొటోలు వైరల్‌

దీనికి ‘నేటికి మా పెళ్లి జరిగి మూడు నెలలు.. నా భార్య కత్రినా కైఫ్‌’ వీడియోను ఎడిట్‌ చేశాడు. అంతేకాదు కత్రినా-విక్కీ జంటగా ఉన్న ఫొటోలకు విక్కీ ఫొటోలకు తన ముఖం ఉండేలా ఎడిట్‌ చేసి పలు వీడియాలు, పోస్ట్‌లు కూడా షేర్‌ చేశాడు. ఇలా కొద్ది రోజులుగా నిందితుడు కత్రినా-విక్కీని ఇబ్బంది పెడుతూ వస్తున్నాడు.కాగా నాలుగేళ్లుగా ప్రేమలో మునిగితేలిన కత్రినా- విక్కీ కౌశల్‌ గతేడాది పెళ్లిపీటలెక్కారు.ప్రస్తుతం వీరిద్దరు సినిమాల్లో నటిస్తూ బిజిబిజీగా ఉంటున్నారు. సల్మాన్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కుతోన్న టైగర్‌-3లో క్యాట్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా.. గోవింద్‌ నామ్‌ మేరా, డుంకీ చిత్రాలతో విక్కీ బిజీగా ఉన్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement