Manasa Radhakrishnan
-
ఆర్జీవీ వ్యూహం.. దసరాకు స్పెషల్ పోస్టర్ రిలీజ్!
టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘వ్యూహం’. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి టీజర్,ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇటీవలో ఓ సాంగ్‌ను వర్మ విడుదల చేశారు. ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. తాజాగా దసరా సందర్భంగా డైరెక్టర్ ఆర్జీవీ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. విజయదశమి శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ చేశారు. కాగా.. ఈ చిత్రాన్ని రెండు పార్టులుగా తెరకెక్కించనున్నట్లు ఆర్జీవీ ప్రకటించారు. మొదటి భాగం వ్యూహం పేరుతో నవంబర్ 10న విడుదల కానుంది. శపథం పేరుతో రెండో భాగం జనవరి 25న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. వ్యూహం మూవీలో వైఎస్ జగన్ గారి పాత్రతో దక్షిణాది నటుడు అజ్మల్ అమీర్ నటిస్తుండగా.. వైఎస్ భారతి గారి పాత్రలో మానస రాధాకృష్ణన్ నటిస్తున్నారు. ‘అహంకారానికి ఆలోచనకు మధ్య జరిగే యుద్ధం’ ఇతివృత్తంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ నిర్మిస్తున్నారు. HAPPY DUSSEHRA from the team of VYOOHAM 💐💐💐 pic.twitter.com/4u6Ecpp1So — Ram Gopal Varma (@RGVzoomin) October 23, 2023 -
PSPK28:పవన్ కల్యాణ్ చిత్రంలో నటించడం లేదు: హీరోయిన్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పవన్ కెరీర్ లో 28 చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. కొద్ది రోజులుగా ఈ సినిమాకి సంబంధించి జోరుగా చిత్రంలో పవన్ డ్యూయల్ పాత్ర పోషించనున్నాడని, ఈ చిత్రానికి ఇదేనంటూ గాసిప్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే వీటిని హరీశ్ శంకర్ కొట్టి పారేశాడు. అలాగే ఈ సినిమాలో పవన్ సరసన యంగ్ అండ్ బ్యూటిఫుల్ మలయాళ నటి మానస రాధాకృష్ణన్ నటిస్తుంది అన్న వార్తలు వినిపించాయి. తాజాగా ఈ వార్తలపై హీరోయిన్ మానస రాధాకృష్ణన్ స్పందించింది. .తాను పవన్ కల్యాణ్ సినిమాలో నటిస్తున్నట్టు సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం కాదని స్పష్టం చేసింది. కాగా, చిత్ర యూనిట్ కూడా పుకార్లను నమ్మొద్దని అభిమానులకు విజ్ఞప్తి చేసింది. ఏ విషయం అయినా తాము అధికారికంగా చెప్పే వరకు నమ్మొద్దని ట్వీట్ చేసింది. చదవండి: మీనాక్షి చౌదరి గురించి ఈ విషయాలు తెలుసా? కంగనా తిట్టినా..చేయి చేసుకున్నా తట్టుకున్నా కానీ...