పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పవన్ కెరీర్ లో 28 చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. కొద్ది రోజులుగా ఈ సినిమాకి సంబంధించి జోరుగా చిత్రంలో పవన్ డ్యూయల్ పాత్ర పోషించనున్నాడని, ఈ చిత్రానికి ఇదేనంటూ గాసిప్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే వీటిని హరీశ్ శంకర్ కొట్టి పారేశాడు.
అలాగే ఈ సినిమాలో పవన్ సరసన యంగ్ అండ్ బ్యూటిఫుల్ మలయాళ నటి మానస రాధాకృష్ణన్ నటిస్తుంది అన్న వార్తలు వినిపించాయి. తాజాగా ఈ వార్తలపై హీరోయిన్ మానస రాధాకృష్ణన్ స్పందించింది. .తాను పవన్ కల్యాణ్ సినిమాలో నటిస్తున్నట్టు సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం కాదని స్పష్టం చేసింది. కాగా, చిత్ర యూనిట్ కూడా పుకార్లను నమ్మొద్దని అభిమానులకు విజ్ఞప్తి చేసింది. ఏ విషయం అయినా తాము అధికారికంగా చెప్పే వరకు నమ్మొద్దని ట్వీట్ చేసింది.
చదవండి:
మీనాక్షి చౌదరి గురించి ఈ విషయాలు తెలుసా?
కంగనా తిట్టినా..చేయి చేసుకున్నా తట్టుకున్నా కానీ...
Comments
Please login to add a commentAdd a comment