ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘వ్యూహం’. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్,ట్రైలర్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా వ్యూహం సినిమా నుంచి YSRCP అనే సాంగ్‌ను వర్మ విడుదల చేశారు. ఈ పాట కోసం ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో నాటు.. నాటు పాటకు ఆస్కార్ అవార్డుతో మరింత గుర్తింపు పొందిన రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు.
(ఇదీ చదవండి: సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి)
వైఎస్సార్‌సీపీ.. వైఎస్సార్‌సీపీ (YSRCP).. ఢీ కొట్టే మా పార్టీ వచ్చింది చూడు.. దమ్మున్న మా పార్టీ వచ్చింది చూడు.. ఆంధ్ర ప్రాంతంలో పుట్టింది నేడు.. సీమ సింగంలా తొడగొట్టే చూడు.. అంటూ సాగే పాటను రాహుల్ అద్భుతంగా పాడారు. ఇప్పటికే వ్యూహం నుంచి వెన్ను పోటు సాంగ్ పేరుతో.. పులుల రూపంలో గుంట నక్కలు అంటూ ఒక పాటను వర్మ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ పాట యూట్యూబ్‌లో సంచలనం క్రియేట్ చేస్తుంది. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జరిగిన పరిణామాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు రామ్ గోపాల్ వర్మ.
రెండు పార్టులుగా రానున్న ఈ సినిమా.. మొదటి భాగం వ్యూహం పేరుతో నవంబర్ 10న విడుదల కానుంది. శపథం పేరుతో రెండో భాగం జనవరి 25న విడుదల కానున్నట్లు ఆయన ప్రకటించారు. వ్యూహం మూవీలో వైఎస్ జగన్ గారి పాత్రతో దక్షిణాది నటుడు అజ్మల్ అమీర్ నటిస్తుండగా.. వైఎస్ భారతి గారి పాత్రలో మానస రాధాకృష్ణన్ నటిస్తున్నారు. ‘అహంకారానికి ఆలోచనకు మధ్య జరిగే యుద్ధం’ ఇతివృత్తంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ నిర్మిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment