![Ram Gopal Varma Sensational Announcement - Sakshi](/styles/webp/s3/article_images/2022/10/27/Ram%20Gopal%20Varma.jpg.webp?itok=mldbntKH)
వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచలన ప్రకటన చేశాడు. రాజకీయాలపై ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలిపాడు. ‘నేను అతి త్వరలో “వ్యూహం” అనే రాజకీయ సినిమా తియ్యబోతున్నాను. ఇది బయోపిక్ కాదు …బయో పిక్ కన్నా లోతైన రియల్ పిక్. బయో పిక్ లో అయినా అబద్దాలు ఉండొచ్చు కానీ ,రియల్ పిక్ లో నూటికి నూరు పాళ్ళు నిజాలే ఉంటాయి.
అహంకారానికి , ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుండి ఉద్భవించిన ‘వ్యూహం’ కధ , రాజకీయ కుట్రల విషం తో నిండి ఉంటుంది . రాచకురుపు పైన వేసిన కారం తో బొబ్బలెక్కిన ఆగ్రహానికి ప్రతికాష్టే “వ్యూహం” చిత్రం.
ఈ చిత్రం 2 పార్ట్స్ గా రాబోతుంది. మొదటి పార్ట్ “వ్యూహం” , రెండోది “శపథం” .రెండింటిలోనూ రాజకీయఆరాచకీయాలు పుష్కలంగా ఉంటాయి. రాష్ట్ర ప్రజలు మొదటి చిత్రం “వ్యూహం “ షాక్ నుంచి తెరుకునే లోపే వాళ్ళకి ఇంకో ఎలెక్ట్రిక్ షాక్ , పార్ట్ 2 “శపథం “ లో తగులుతుంది .
వ్యూహం చిత్ర నిర్మాత నాతో అంతకు ముందు వంగవీటి సినిమా తీసిన దాసరి కిరణ్ . ఎలక్షన్స్ టార్గెట్ గా ఈ చిత్రం తియ్యట్లేదని చెప్తే ఎవ్వరూ నమ్మరు కనక ,ఏం చెప్పాలో, ఏం చెప్పకూడదో చెప్పాల్సిన అవసరం లేదని మీకు వేరే చెప్పక్కర్లేదు కనక చెప్పట్లేదు’ అంటూ వరుస ట్వీట్స్ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment