టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమా నేడు (మార్చి 2) ప్రపంవ్యాప్తంగా విడుదలైంది. ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున థియేటర్‌లలోకి వచ్చేసింది. అజ్మల్, మానస ముఖ్య తారలుగా రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో రామధూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్‌కుమార్ నిర్మించిన చిత్రం ‘వ్యూహం’.
వ్యూహం చిత్రాన్ని వర్మ తన టీమ్‌తో చూస్తున్నట్లు కొంత సమయం క్రితం సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అంతేకాకుండా అమెరికాలో విడుదల అవుతున్న థియేటర్ల లిస్ట్ కూడా ఆయన విడుదల చేశారు. వాస్తవంగా వ్యూహం సినిమా రెండు నెలల క్రితమే విడుదల కావాల్సి ఉంది. కానీ నారా లోకేష్ కోర్టుకు వెళ్లి పలు అభ్యంతరాలను తెలపడంతో విడుదల విషయంలో జాప్యం ఏర్పడింది. అన్నీ అడ్డంకులను ఎదుర్కొని నేడు విడుదలైన వ్యూహం సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. లోకేష్ అడ్డుకునేంత ఇబ్బంది ఈ చిత్రంలో ఏముంది అని ఆ పార్టీకి చెందిన వారు కూడా వ్యూహం చిత్రాన్ని చూడాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ థియేటర్ వద్ద సందడి వాతవారణం నెలకొని ఉంది.
వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారు మరణించిన సమయం నుంచి వైఎస్ జగన్‌గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు తొలి భాగం ఉంటుంది. ఈ క్రమంలో ఎవరెవరు ఏయే వ్యూహాలు రచించారు వంటి ప్రధాన ఘటనలు ఈ సినిమాలో ఉన్నాయి. పార్ట్ -2 'శపథం' మార్చి 8న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment