
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన కొత్త సినిమా 'వ్యూహం'. పొలిటికల్ డ్రామా కథతో తీసిన ఈ చిత్రంలో ఏపీ రాజకీయాల‍్ని చూపించనున్నారు. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి కాకముందు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జర్నీ ఎలా సాగింది? ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట‍్రానికి సీఎం ఎలా అయ్యారు అనే విషయాల్ని ఈ సినిమాలో చూపించబోతున్నారు.
(ఇదీ చదవండి: ఖరీదైన కారు కొన్న 'బిగ్‌బాస్' మానస్.. రేటు ఎంతో తెలుసా?)
డిసెంబరు 29న థియేటర్లలో రిలీజ్ కాబోతున్న 'వ్యూహం' నుంచి ఇప్పుడు జగనన్న అని సాగే లిరికల్ గీతాన్ని రిలీజ్ చేశారు. ఇందులో భాగంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర విజువల్స్ ని ఎక్కువగా చూపించారు. ప్రధాన పాత్రలో అజ్మల్ అమీర్ నటించారు. ఈ పాట ఇప్పుడు సీఎం జగన్ అభిమానుల్ని అలరిస్తోంది. ఇకపోతే 'వ్యూహం' రిలీజ్ విషయంలో పచ్చ బ్యాచ్ పలు ఇబ్బందులు పెట్టినప్పటికీ.. సెన్సార్ సర్టిఫికెట్ పొందిన ఈ సినిమా.. డిసెంబరు 29న గ్రాండ్‌గా విడుదల కానుంది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'మంగళవారం' సినిమా.. స్ట్రీమింగ్ అందులోనే)
Comments
Please login to add a commentAdd a comment