ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన 'వ్యూహం' మూవీ.. ఈ రోజు అంటే డిసెంబరు 29న థియేటర్లలో రిలీజ్ కావాల్సి ఉంది. అయితే సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలని నారా లోకేశ్ పిటిషన్ వేయడంతో.. జనవరి 11 వరకు సెన్సార్ సర్టిఫికెట్‍ని సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీనికే పచ్చ బ్యాచ్ తెగ హడావుడి చేస్తోంది. ఏకంగా సినిమా సెన్సార్ రద్దు చేశారన్నంత రేంజులో హడావుడి చేస్తోంది.
(ఇదీ చదవండి: కమెడియన్ బ్రహ్మానందం మరో టాలెంట్.. మెగాస్టార్ ఇంట్రెస్టింగ్ పోస్ట్)
ఇలా పచ్చ బ్యాచ్ చేస్తున్న ఓవరాక్షన్‌పై దర్శకుడు రాంగోపాల్ వర్మ కౌంటర్ ఇచ్చాడు. 'ఏబీఎన్ ఛానల్‌కి సంబంధించిన ఈ వ్యక్తి ,ఇంకా మరికొన్ని ఛానెల్స్ చెప్తున్నట్టు 'వ్యూహం' సినిమా సెన్సార్ సర్టిఫికేట్ 'రద్దు' అవ్వలేదు. నిజం ఏంటంటే కోర్ట్.. సీబీఎఫ్‌సీ నుంచి సర్టిఫికేట్ ఇవ్వటానికి సంబంధించిన రికార్డులు జనవరి 12లోపు సబ్మిట్ చెయ్యాలని అడిగారు' అని డైరెక్టర్ రాంగోపాల్ వర్మ క్లారిటీ ఇచ్చాడు. దీనిబట్టి చూస్తే త్వరలో ఈ ఇష్యూ క్లియర్ అయి సినిమా విడుదలవుతుంది.
(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)
ఈ ఛానల్ @abntvtelugu కి సంబంధించిన ఈ వ్యక్తి ,ఇంకా మరి కొన్ని ఛానళ్ళు చెప్తున్నట్టు వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికేట్ “రద్దు” అవ్వలేదు.. నిజం ఏమిటంటే కోర్టు CBFC నుంచి సర్టిఫికేట్ ఇవ్వటానికి సంబంధించిన రికార్డులు జనవరి 12th కల్లా సబ్మిట్ చెయ్యాలని అడిగారు https://t.co/hB5ak477cR
— Ram Gopal Varma (@RGVzoomin) December 29, 2023
Comments
Please login to add a commentAdd a comment