రామ్‌గోపాల్ వర్మ ఐడియాలే వేరు! సినిమా కథను ఆన్‌లైన్‌లో పెట్టి.. అందులో ఎవరు నటిస్తే బాగుంటుందనేది ప్రేక్షకులు నిర్ణయిస్తే ఎలా ఉంటుంది? మెజారిటీ ఓటింగ్‌ను ప్రాతిపదికలోకి తీసుకుని అదే తారాగణంతో సినిమా వస్తే.. ఐడియా అదుర్స్ కదూ! దీన్ని రియాలిటీలో చేసి చూపిస్తానంటున్నారు వర్మ. ఆర్జీవీ డెన్ వేదికగా శనివారం నాడు ‘యువర్ ఫిల్మ్’ అనే కాన్సెప్ట్‌ను ప్రెస్ మీట్ ద్వారా వివరించారు.
ప్రేక్షకులే సినిమా హిట్ ఫ్లాప్ నిర్ణయిస్తారు కాబట్టి, ఆ ప్రేక్షకులే సినిమాకు సంబంధించిన హీరో, హీరోయిన్, డైరక్టర్, సినిమాటోగ్రాఫర్ ఇలా అందరు టెక్నీషియన్స్ ను RGV వెబ్‌సైట్ ద్వారా ఓటింగ్ పద్దతిలో ప్రజలే ఎన్నుకుని, అందులో ముందంజలో ఉన్న వారితో సినిమా తీస్తారు. ఆర్జీవీ నిర్మాతగా దాన్ని ఆరు నెలల్లో తీసి రిలీజ్ చేస్తారు. సినిమా కథనీ RGV వెబ్‌సైట్‌లో (rgvden.com) ఒక రెండు లైన్లలో పెట్టి, ఆ కథ లైను నచ్చిన యాక్టర్స్, డైరెక్టర్స్, డిఓపి, మూజిక్ డైరక్టర్ ఇలా అందరూ అప్లై చేసుకోవచ్చు, ప్రేక్షకులు ఇంటరెస్ట్ ఉండి అప్లై చేసుకున్న ప్రతి డిపార్ట్మెంట్ వారిని.. ఎవరి వర్క్ నచ్చిందో వారిని ఓటింగ్ పద్ధతిలో ఎన్నుకుంటారు.
ఉదాహరణకి హీరో కొసం ఒక 1000 మంది అప్లై చేస్తే అందులో నుంచి 50 మందిని RGV డెన్ టీమ్ షార్ట్ లిస్ట్ చేసి వెబ్‌సైట్‌లో పెడతారు, ఆ తరవాత RGV పెట్టే టాస్కులను బట్టి వారు ఆడిషన్స్ ఇస్తూ ఉంటారు. ఆ ఆడిషన్స్ లో ప్రేక్షకులకు ఎక్కువ ఎవరు నచ్చితే అతను హీరోగా సినిమా తీస్తారు. ఇదే తరహాలో హీరోయిన్, డైరెక్టర్స్, డిఓపి ఇలా అందరినీ ప్రేక్షకులే ఎన్నుకుంటారు. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల కోసం ఎన్నుకున్నదే ప్రజాస్వామ్యం.. అలానే ప్రెక్షకుల చేత, ప్రేక్షకుల కొరకు, ప్రేక్షకుల కోసం చేసే సినిమాలే ఈ యువర్ ఫిల్మ్ ఐడియా.
To know how to involve the audience in the making of a film , Click https://t.co/4u0rJD7Jn3 YOUR FILM concept #RgvYourFilm pic.twitter.com/MVSoiUFtXU
— Ram Gopal Varma (@RGVzoomin) April 6, 2024
Comments
Please login to add a commentAdd a comment