ఇతిహాసాల మీద ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. అలాగని అన్నీ ఆదరణకు నోచుకోలేదు. అందుకు ఆదిపురుష్ బెస్ట్ ఎగ్జాంపుల్. ప్రభాస్ హీరోగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. అయితే పురాణాలను ప్రస్తావిస్తూ తెరకెక్కించిన మైథాలజీ యాక్షన్ డ్రామా కల్కి 2898 ఏడీని సినీప్రియులు ఎంతగానో ఆదరించారు. ఈ క్రమంలో కల్కికి సీక్వెల్ కూడా రానుంది.
డేంజర్
ఇదిలా ఉంటే బాలీవుడ్‌లో రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి జంటగా రామాయణ్ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రాలపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ భిన్నాభిప్రాయం వ్యక్తం చేశాడు. పురాణాల మీద సినిమాలు తీయడం డేంజర్.. ఎందుకంటే వాటి గురించి జనాలకు ఎంతో కొంత అవగాహన ఉంటుంది. దాన్ని మీరు మరోలా చూపిస్తే అది బెడిసికొడుతుంది. పైగా పురాణాల్లో పేర్కొన్న వ్యక్తులను మన దేశంలో దేవుళ్లుగా పూజిస్తారు. కాబట్టి ఇక్కడ అలాంటి సాహసాలు చేయలేము.
ట్రోలింగ్ ఎక్కువ..
ఒకప్పుడు బాబూభాయ్ మిస్త్రీ.. సంపూర్ణ రామాయణ వంటి పౌరాణిక సినిమాలు తీశాడు. ఎన్టీ రామారావు కూడా అలాంటి ఎన్నో సినిమాలు చేశాడు. వాటిని ఇప్పటికీ అందరూ ఇష్టపడతారు, గౌరవిస్తారు. వాళ్ల వేషధారణను చూసి చేతులెత్తి మొక్కుతారు కూడా! అదే ఆదిపురుష్‌ను తీసుకోండి. అందులో లంకేశ్‌గా సైఫ్ అలీ ఖాన్ లుక్, హనుమాన్ లుక్ మీద ఎంత రచ్చ జరిగిందో.. ఇలా పదేపదే విమర్శలు వెల్లువెత్తినప్పుడు ఈ తరహా జానర్‌పై సినిమాలు తీయడం చాలా డేంజర్.
చూసే విధానమే మారిపోయింది
నేనేమంటానంటే.. కొత్త కథను తీసుకుని దానికి రామయణ అనే పేరు పెట్టకుండా తీయండి. ఇప్పుడు ఆదిపురుష్.. ప్రభాస్ సినిమా అంటే జనాలు ఒకలా ఆలోచిస్తారు. అది రామాయణం అంటే జనాల ఆలోచన మరోలా ఉంటుంది. ఇలాంటి సున్నిత అంశాల జోలికి వెళ్లడం అవసరమా? ఏదేమైనా ధైర్యం చేసి మరీ ఇలాంటి మూవీస్ తెరకెక్కించాలని ప్రయత్నిస్తున్నవారికి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను అన్నాడు.
చదవండి: తన సినిమా చూసి షాకైన డైరెక్టర్.. తనకు తెలియకుండానే మార్చేశారు!
Comments
Please login to add a commentAdd a comment