వాళ్ల బాత్రూమ్‌ల్లో చూస్కుంటారు!: RGV | Vyuham & Sapatham: RGV Mass Trolling On Chandrababu's TDP, Pawan's Janasena | Sakshi
Sakshi News home page

నాలాగే.. వాళ్లూ వాళ్ల బాత్రూమ్‌ల్లో చూస్కుంటారు!

Published Mon, Feb 19 2024 11:12 AM | Last Updated on Mon, Feb 19 2024 3:43 PM

Vyuham Sapatham: RGV Mass Trolling On Chandrababu TDP Pawan Janasena  - Sakshi

హైదరాబాద్‌, సాక్షి: ఏపీ రాజకీయాల స్ఫూర్తితో పొలిటికల్‌ థ్రిల్లర్‌లుగా వ్యూహం, శపథం సినిమాలతో బ్యాక్‌ టూ బ్యాక్‌ విడుదలకు రెడీ అయ్యారు విలక్షణ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ.  ఈ క్రమంలో ఆయన పలు ఇంటర్వ్యూల్లో రాజకీయ పరమైన ప్రశ్నలు.. అలాగే సోషల్‌ మీడియాలో పలు అభ్యంతరాలు.. విమర్శలూ ఎదుర్కొంటున్నారు. తాజాగా వాటికి ఓ వీడియోతో ఆయన సమాధానం ఇచ్చారు. 

బాక్సింగ్‌ రింగ్‌లో ఎంటర్‌ అయితే గట్టిగా గుద్దాలి. అంతేగానీ జుట్టు పీకుతా.. చెంప గిల్లుతా అనే ఆటిట్యూడ్‌తో ఉండకూడదు. అది నా ఫిలాసఫీ.  వ్యూహం, శపథం సినిమాలతో నిజాన్ని బట్టలిప్పి చూపించడం అనేదే నా ఉద్దేశం కూడా. ఈ సినిమా పొలిటికల్‌ సినిమా కదా.. టీడీపీ, జనసేవాళ్లు చూస్తారా? అని కొందరు అడుగుతున్నారు. దానికి ఓ ఉదాహరణ చెబుతా.. 

సికింద్రాబాద్‌లో లంబా థియేటర్‌ అనేది ఉండేది. అందులో సెక్స్‌ సినిమాలు ఆడేవి. సెక్స్‌ అంటే ఇష్టం ఉండి కూడా చాలామంది భయం భయంతో ఆ థియేటర్‌కు వెళ్లేవాళ్లు కాదు. కానీ, నా దృష్టిలో లంబా థియేటర్‌ చేసింది ప్రజాసేవ. నేను పోర్న్‌ చూసినట్లే.. ఎవ్వరికీ తెలియకుండా టీడీపీ, జనసేన వాళ్లు బాత్రూమ్‌లలో కూర్చుని వ్యూహం, శపథం సినిమాలు చూస్తారు. న్యూట్రల్‌ వాళ్లు మాత్రం లివింగ్‌ రూంలో హాయిగా సినిమాలు చూసేయండి. వ్యూహం ఫిబ్రవరి 23, శపథం మార్చి 1న వస్తుంది.. చూస్తే చూడండి లేకుంటే లేదు అంటూ తనదైన స్టైల్‌లో ముగింపును ఇచ్చారాయన. 

అంతకు ముందు.. సీఎం జగన్‌ రాప్తాడు సిద్దం సభ వీడియోను పోస్ట్‌ చేసిన వర్మ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎండిపోయిన రాయలసీమలో.. సీఎం జగన్‌ సమావేశం కోసం జన సముద్రం కదిలి వచ్చిందని.. దేశంలోనే ఇప్పటివరకు ఇలాంటి జనసమీకరణ జరిగి ఉండకపోవచ్చంటూ ట్వీట్‌ చేశారాయన. అదే సమయంలో.. సీఎం జగన్‌ పంచులను.. డైలాగ్‌ అంటే ఇది రా అంటూ వర్మ పోస్ట్‌ చేశారు. ఇక ఈ ఉదయం నుంచి టీడీపీకి.. మరోవైపు జనసేనకు ట్వీట్ల రూపంలో కౌంటర్‌లు వేస్తూ వస్తున్నారాయన.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement