సినిమా రిలీజ్‌కు ముందే ఫోకస్ గ్రూప్ స్క్రీనింగ్స్ అని ఏర్పాటు చేస్తుంటారు. ఇక్కడ టాక్ అదిరిందంటే హిట్టు గ్యారెంటీ! అయితే తనకు మాత్రం నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిందని తీరా చూస్తే సినిమా సూపర్ డూపర్ హిట్టయిందంటోంది దర్శకురాలు జోయా అక్తర్. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'సాధారణంగా నేను ప్రతి ఫీడ్‌బ్యాక్‌ను పట్టించుకోను.
చెత్త మూవీ అని విమర్శ
ఎవరేం చెప్పినా అవునా అని గంగిరెద్దులా తలాడించను. కానీ ఓసారి ఏమైందంటే.. జిందగీ నా మిలేగి దొబారా మూవీ స్క్రీనింగ్ టైంలో ఓ అంకుల్.. ఇది చెత్త మూవీ అంటూ గట్టిగా అరిచాడు. అసలేం మూవీ, ఏం చేస్తున్నారంతా? అని తిట్టాడు. అవును, ఇది మీ వయసువాళ్లకు కాదు. మీ కోసం నా సినిమాను మార్చుకోలేను అని మనసులోనే అనుకున్నాను.
కనెక్ట్ అయ్యామన్న టీనేజర్స్
ఆ పెద్దమనిషి.. నిర్మాత స్నేహితుడి చుట్టమట! అదృష్టవశాత్తూ.. అక్కడ టీనేజర్స్ కూడా ఉన్నారు. వాళ్లు సినిమా మాకు బాగా నచ్చింది, ఈ మూవీకి కనెక్ట్ అయ్యాం అని చెప్పారు. ఆ పెద్దాయన వీళ్లతో గొడవపడటంతో నేను అక్కడి నుంచి బయటకు వచ్చేశాను. అప్పటినుంచి ఇలాంటి స్క్రీనింగ్స్‌కు వెళ్లడమే మానేశాను' అని చెప్పుకొచ్చింది.
సినిమా..
కాగా జోయా అక్తర్.. లక్ బై ఛాన్స్ సినిమాతో దర్శకురాలిగా పరిచయమైంది. ఆమె డైరెక్ట్ చేసిన రెండో సినిమాయే.. జిందగీనా మిలేగి దొబారా. ఈ మూవీ 2011లో విడుదలైంది. ఈ చిత్రంలో హృతిక్ రోషన్, కత్రినా కైఫ్, ఫర్హాన్ అక్తర్, అభయ్ డియోల్, కల్కి కొచ్లిన్, దీప్తి నవల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
చదవండి: చైతో ఎంగేజ్‌మెంట్.. ఎప్పుడూ కలగనలేదన్న శోభిత.. మాతృత్వం కోసం..
Comments
Please login to add a commentAdd a comment