సెలబ్రిటీ లవ్ బర్డ్స్ నాగచైతన్య, శోభిత ధూళిపాళ ఈ మధ్యే నిశ్చితార్థం చేసుకున్నారు. ఆగస్టులో జరిగిన ఈ ఎంగేజ్‌మెంట్ గురించి శోభిత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'నా ఎంగేజ్‌మెంట్ గ్రాండ్‌గా జరగాలని ఎప్పుడూ కలలు కనలేదు, దానికోసం ఎటువంటి ప్రణాళికలూ రచించలేదు. మన సాంప్రదాయాలకు అనుగుణంగా ఉండాలనుకున్నానంతే!
నాకైతే పర్ఫెక్ట్
అనుకున్నట్లుగానే సన్నిహితుల సమక్షంలో ప్రశాంతంగా, సింపుల్‌గా, సూపర్‌గా జరిగింది. అప్పుడు సంతోషంతో నా మనసు ఉప్పొంగిపోయింది. కాబట్టి ఇది సింపుల్‌గా జరిగిందని చెప్పలేను. నా వరకు పర్ఫెక్ట్ అని మాత్రమే అనగలను. పెళ్లి చేసుకోవాలి, పిల్లలుండాలని నేనెప్పుడూ అనుకునేదాన్ని. మాతృత్వం అంటే నాకెంతో ఇష్టం. నేను నా తల్లిదండ్రులను, సంస్కృతి, సాంప్రదాయాలను ఎంతగానో గౌరవిస్తాను. ఇవన్నీ ఎల్లప్పుడూ నాతో ఉండాలని కోరుకుంటాను' అని శోభిత చెప్పుకొచ్చింది.
సినిమా..
కాగా చైతన్య-శోభితల ఎంగేజ్‌మెంట్ ఆగస్టు 9న జరిగింది. చై ప్రస్తుతం తండేల్ సినిమాతో బిజీగా ఉన్నాడు. శోభిత విషయానికి వస్తే ఈమె 2013లో ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ విజేతగా నిలిచింది. రామన్ రాఘవన్ 2.ఓ, మేడ్ ఇన్ హెవెన్, ది నైట్ మేనేజర్ చిత్రాలతో బాలీవుడ్‌లో గూఢచారి, మేజర్ సినిమాలతో తెలుగులో పాపులారిటీ సంపాదించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment