Zoya Akhtar
-
చెత్త సినిమా అన్నారు.. కట్ చేస్తే బ్లాక్‌బస్టర్!
సినిమా రిలీజ్‌కు ముందే ఫోకస్ గ్రూప్ స్క్రీనింగ్స్ అని ఏర్పాటు చేస్తుంటారు. ఇక్కడ టాక్ అదిరిందంటే హిట్టు గ్యారెంటీ! అయితే తనకు మాత్రం నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిందని తీరా చూస్తే సినిమా సూపర్ డూపర్ హిట్టయిందంటోంది దర్శకురాలు జోయా అక్తర్. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'సాధారణంగా నేను ప్రతి ఫీడ్‌బ్యాక్‌ను పట్టించుకోను. చెత్త మూవీ అని విమర్శఎవరేం చెప్పినా అవునా అని గంగిరెద్దులా తలాడించను. కానీ ఓసారి ఏమైందంటే.. జిందగీ నా మిలేగి దొబారా మూవీ స్క్రీనింగ్ టైంలో ఓ అంకుల్.. ఇది చెత్త మూవీ అంటూ గట్టిగా అరిచాడు. అసలేం మూవీ, ఏం చేస్తున్నారంతా? అని తిట్టాడు. అవును, ఇది మీ వయసువాళ్లకు కాదు. మీ కోసం నా సినిమాను మార్చుకోలేను అని మనసులోనే అనుకున్నాను. కనెక్ట్ అయ్యామన్న టీనేజర్స్ఆ పెద్దమనిషి.. నిర్మాత స్నేహితుడి చుట్టమట! అదృష్టవశాత్తూ.. అక్కడ టీనేజర్స్ కూడా ఉన్నారు. వాళ్లు సినిమా మాకు బాగా నచ్చింది, ఈ మూవీకి కనెక్ట్ అయ్యాం అని చెప్పారు. ఆ పెద్దాయన వీళ్లతో గొడవపడటంతో నేను అక్కడి నుంచి బయటకు వచ్చేశాను. అప్పటినుంచి ఇలాంటి స్క్రీనింగ్స్‌కు వెళ్లడమే మానేశాను' అని చెప్పుకొచ్చింది.సినిమా..కాగా జోయా అక్తర్.. లక్ బై ఛాన్స్ సినిమాతో దర్శకురాలిగా పరిచయమైంది. ఆమె డైరెక్ట్ చేసిన రెండో సినిమాయే.. జిందగీనా మిలేగి దొబారా. ఈ మూవీ 2011లో విడుదలైంది. ఈ చిత్రంలో హృతిక్ రోషన్, కత్రినా కైఫ్, ఫర్హాన్ అక్తర్, అభయ్ డియోల్, కల్కి కొచ్లిన్, దీప్తి నవల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.చదవండి: చైతో ఎంగేజ్మెంట్.. ఎప్పుడూ కలగనలేదన్న శోభిత.. మాతృత్వం కోసం.. -
Ola Electric IPO: పేటీఎం బాస్ షేర్లు విక్రయించడం లేదా?
ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓకు వస్తుండటంలో మార్కెట్లో అందరి దృష్టి దీనిమీదే ఉంది. ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓ రీటైల్ సబ్స్క్రిప్షన్లు ఆగస్టు 2 నుంచి 6వ తేదీ వరకు ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉంటాయి. ఒక్కో షేర్ ధరను రూ.72 - 76గా కంపెనీ నిర్ణయించింది.కాగా ఓలా ఎలక్ట్రిక్‌లో గణనీయమైన సంఖ్యలో షేర్లున్న పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ, బాలివుడ్ డైరెక్టర్ జోయా అక్తర్, ఆమె సోదరుడు బాలివుడ్ నటుడు సోదరుడు ఫర్హాన్ అక్తర్ రానున్న ఐపీఓలో తమ షేర్లను విక్రయించకుండా అంటిపెట్టుకోనున్నారు. మనీకంట్రోల్ కథనం ప్రకారం.. వీరు ఆఫర్ ప్రైస్ బ్యాండ్ రూ. 72-76 షేరు ఎగువ ముగింపులో 26 శాతం లాభాల వద్ద ఉన్నారు.విజయ్ శేఖర్ శర్మ, అక్తర్ ద్వయం పెట్టుబడి తేదీ 2021 డిసెంబర్ 21గా నమోదైంది. అప్పటి నుంచి బెంచ్‌మార్క్ నిఫ్టీ 48.32 శాతం పెరిగింది. శర్మ తన పెట్టుబడి సంస్థ వీఎస్ఎస్ ఇన్వెస్ట్‌కో ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఏడు సిరీస్ సి ప్రిఫరెన్స్ షేర్లను రూ.7.5 కోట్లకు కొనుగోలు చేశారు. ఇప్పుడవి ప్రైస్ బ్యాండ్ దిగువన రూ. 8.96 కోట్లు, ప్రైస్ బ్యాండ్ ఎగువన రూ. 9.46 కోట్లుగా ఉన్నాయి.జోయా అక్తర్ సింగిల్ సిరీస్ సి ప్రిఫరెన్స్ షేర్‌ను రూ. 1.07 కోట్లకు కొనుగోలు చేయగా, ఫర్హాన్ 2 షేర్లను రూ. 2.14 కోట్లకు కొనుగోలు చేశారు. ఫర్హాన్‌తో కలిసి ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ సహ వ్యవస్థాపకుడు రితేష్ సిధ్వానీ కూడా ఓలా ఎలక్ట్రిక్ సిరీస్ సి రౌండ్లో రెండు షేర్లను కొనుగోలు చేశారు. ప్రిఫరెన్స్ షేర్ల మార్పిడి తర్వాత, శర్మ ఓలా ఎలక్ట్రిక్‌లో 12.45 లక్షలు, జోయా అక్తర్ 1.78 లక్షలు, ఫర్హాన్ అక్తర్ 3.56 లక్షలు, రితేష్ సిధ్వానీ 3.56 లక్షల షేర్లను కలిగి ఉన్నారు. -
జోయా అఖ్తర్ యాక్టర్స్‌కు సెలవులివ్వదట, కారణం?
సినిమా.. ఆన్ స్క్రీన్ .. ఆఫ్ స్క్రీన్ సంగతులు భలే సరదాగా ఉంటాయి. వినోదాన్నీ పంచుతాయి. వీటిల్లో హీరోహీరోయిన్స్ గురించిన ముచ్చట్లకు ఉండే క్రేజ్ సరే.. దర్శకుల స్టయిల్ ఆఫ్ మూవీ మేకింగ్ పట్లా ఓ ఆసక్తి ఉంటుంది సినీ అభిమానులకు. ఆ ఇంటరెస్ట్నే క్యాచ్ చేశాం. ఇలా.. ! బయటకు వెళ్లిపోతారనే.. జోయా అఖ్తర్.. దర్శకురాలిగానే కాదు.. రైటర్‌గానూ ప్రసిద్ధి. రాసుకున్నదాన్ని రాసుకున్నట్టే చిత్రీకరించాలనే పట్టుదలతో ఏమీ ఉండదు. ఏదైనా సీన్‌ను షూట్ చేస్తున్నప్పుడు కొత్త ఐడియా తడితే మార్చడానికి ఏమాత్రం వెనుకాడదు. రీటేక్స్ విషయంలో చాలా లిబరల్గా ఉంటుంది. వైవిధ్యమైన నటీనటులతో సినిమాలు చేయడం ఆమెకు ఇష్టం. సాంఘిక అంశాలు, నిజ జీవితాల్లోని అనుబంధాలను మిళితం చేసి సినిమాలు తీయడం ఆమె ప్రత్యేకత. ‘దిల్ ధడక్నే దో’లోని అక్కాతమ్ముడి బాండింగ్‌కు.. తన తోబుట్టువు ఫర్హాన్ అఖ్తర్‌తో తనకున్న అనుబంధమే ప్రేరణట. సినిమా షూటింగ్ షెడ్యూల్స్‌లో యాక్టర్స్‌కు సెలవులివ్వదట.. నటీనటులు కథా పాత్రల్లోంచి బయటకు వెళ్లిపోతారనే భయంతో. నో డీటైలింగ్.. సంజయ్ లీలా భన్సాలీ .. సినిమాల్లో డీటైలింగ్స్ మిస్ అవడు కానీ నటీనటులకు మాత్రం ఎక్కువ డీటైల్స్ ఇవ్వడు. ఏ మూవీకైనా కొన్నేళ్ల ముందుగానే స్క్రిప్ట్‌ను సిద్ధం చేసిపెట్టుకుంటాడు. ఆయన చిత్రాల్లోని చాలా సన్నివేశాలు.. తాను చిన్నప్పుడు ఎరిగిన మనుషులు, తిరిగిన ఊళ్లు, పెరిగిన వాతావరణాన్ని తలపించేవిగా ఉంటాయిట. డార్క్ స్టోరీ అనురాగ్ కశ్యప్ సినిమాలు ఎక్కువగా డార్క్ టాపిక్స్ మీదే ఉంటాయి. కారణం.. ఆయన చైల్డ్ అబ్యూజ్ విక్టిమ్ కావడమే. తన సినిమాల్లోని క్యారెక్టర్స్ గురించి నటీనటులకు ఎలాంటి సూచనలివ్వడు. స్క్రిప్ట్‌ను క్షుణ్ణంగా చదివి నటీనటులే ఆయా క్యారెక్టర్స్‌ను అర్థం చేసుకోవాలి. సీన్స్ బాగా రావడానికి.. తమ జీవితాల్లో జరిగిన డార్క్ ఇన్సిడెంట్స్ను గుర్తుతెచ్చుకొమ్మని నటీనటులకు చెప్తాడట. రీటేక్స్ను ఇష్టపడడు.