
టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసు స్టేషన్‌లో ఐటీ చట్టం కింద కేసు నమోదైంది. వ్యూహం సినిమా ప్రమోషన్ల సమయంలో చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, నారా బ్రాహ్మణి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోస్టు చేశారని తెదేపా మండల ప్రధాన కార్యదర్శి రామలింగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆర్జీవీపై పోలీసు కేసు నమోదు చేశారు.
కాగా.. ఇటీవల వైసీపీ సోషల్ మీడియా వారియర్స్‌పై వరుసగా కేసులు నమోదు చేస్తోన్న సంగతి తెలిసిందే. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే కూటమి ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని వైసీపీ నాయకులు మండిపడుతున్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని హితవు పలికారు. పలువురు వైసీపీ సోషల్ మీడియా వారియర్స్‌ను టార్గెట్ చేసి మరీ కేసులు నమోదు చేస్తున్నారు. కాగా.. అక్రమ కేసులపై కార్యకర్తలకు అండగా ఉంటామని వైకాపా అధినేత వైఎస్ జగన్ ఇప్పటికే ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment