Madhuram Movie
-
స్కూల్ ప్రేమను గుర్తు చేసే 'మధురం'.. ఎలా ఉందంటే?
టైటిల్: మధురం నటీనటులు: ఉదయ్ రాజ్, వైష్ణవీ సింగ్, బస్ స్టాప్ కోటేశ్వర రావు, కిట్టయ్య, ఎఫ్ఎం బాబాయ్, దివ్య శ్రీ, సమ్యూ రెడ్డి తదితరులు డైరెక్టర్: రాజేష్ చికిలే నిర్మాత - ఎం. బంగర్రాజు సినిమాటోగ్రఫీ - మనోహర్ కొల్లి సంగీతం - వెంకీ వీణ ఎడిటర్ - ఎన్టీఆర్ విడుదల తేదీ ఏప్రిల్ 18, 2025 మధురం కథేంటంటే..రామ్ (ఉదయ్ రాజ్), మధు (వైష్ణవీ సింగ్) ఒక రొమాంటిక్ కామెడీ సన్నివేశంలో కలుస్తారు. వారి అమాయకమైన హృదయాలు తక్షణమే ఒకరినొకరు ఆకర్షిస్తాయి. 10వ తరగతి అమ్మాయి, 9వ తరగతి అబ్బాయితో ప్రేమలో పడటం వల్ల ఈ యువ జంట అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. చివరికీ వారి ప్రేమ కథ సక్సెస్ అవుతుందా? తల్లిదండ్రులు, సమాజం నుంచి వారు ఎదుర్కొనే సవాళ్లు ఏమిటి? వాటిని ఎలా అధిగమించారు? వాళ్లు తమ ప్రేమను గెలిచారా? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే మధురం చూడాల్సిందే!ఎలా ఉందంటే..మధురం టైటిల్ చూస్తే లవ్ స్టోరీ అని ఆడియన్స్‌కు గుర్తుపట్టేలా ఉంది. యవ్వనంలో చిగురించిన ప్రేమే కథాంశంగా తెరకెక్కించిన తీరు బాగుంది. మొదటి భావోద్వేగాల సున్నితత్వాన్ని, గోదావరి ప్రాంతం శాశ్వత సౌందర్యాన్ని తెరపై అందంగా ఆవిష్కరించారు డైరెక్టర్. గోదావరి దాదాపు ఒక పాత్రలా కనిపిస్తూ సినిమా సన్నివేశాలను మరింత ఉన్నతంగా ఆడియన్స్‌కు పరిచయం చేశారు. స్కూల్లో ఇద్దరు విద్యార్థుల ప్రేమ చుట్టే కథ అద్భుతంగా తీర్చిదిద్దారు.అందమైన కాన్సెప్ట్‌ను ఎంచుకొని, హృదయపూర్వకంగా అందించారు దర్శకుడు రాజేష్ చికిలే . కథ పరంగా సరళంగా ఉన్నప్పటికీ, 90ల తరం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. కొన్ని రిపీటెడ్ సన్నివేశాలు, రెండు భాగాల్లో కొంత లాగ్ కాస్కా బోరింగ్‌గా అనిపిస్తుంది. కానీ దర్శకుడు రాజేష్ చికిలే అందించాలనుకున్న సందేశాన్ని ఇవి దెబ్బతీయలేదు. కథలో కొన్ని భాగాలు ప్రత్యేకంగా బలంగా ఉన్నాయి. ప్రధాన పాత్రల భావోద్వేగాన్ని ప్రేక్షకులు అనుభవించేలా చేస్తాయి. వెంకీ వీణ సంగీతం ఈ సినిమాకు ప్లస్. స్క్రీన్‌పై రెండు పాటలు మాత్రమే ఆకట్టుకున్నాయి. 90ల ప్రేమ కథలను ఇష్టపడే వారికి, గోదావరి సౌందర్యాన్ని ఆస్వాదించాలనుకునే వారికి ఈ చిత్రం ఒక మంచి ఎంటర్టైనర్గా నిలుస్తుంది.ఎవరెలా చేశారంటే..డెబ్యూ హీరో ఉదయ్ రాజ్ తన నటనతో మెప్పించారు. గతంలో ఆచార్య, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాల్లో చిన్న పాత్రల్లో కనిపించిన ఉదయ్.. తన నటనా నైపుణ్యాన్ని చాటాడు. వైష్ణవీ సింగ్త తన పాత్రలో ఆకట్టుకుంది. తన అందమైన రూపంతో, నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. మిగిలిన నటీనటులు తమ పాత్రలో పరిధిలో అద్భతంగా చేశారు. సాంకేతికత విషయానికొస్తే మనోహర్ కొల్లి సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. నందమూరి తారక రామారావు తన కత్తెరకు మరింత పని చెప్పాల్సింది. వెంకీ వీణ నేపథ్య సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు సంస్థకు తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. -
ఆచార్య, ఆర్ఆర్ఆర్ నటుడు హీరోగా టీనేజ్ లవ్ స్టోరీ.. రిలీజ్ ఎప్పుడంటే?
ఆచార్య, ఆర్ఆర్ఆర్ లాంటి పెద్ద చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన ఉదయ్‌రాజ్ ‘మధురం’ మూవీతో హీరోగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రానికి రాజేష్ చికిలే దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో వైష్ణవి సింగ్ హీరోయిన్గా నటించింది. శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్ పతాకంపై బంగార్రాజు నిర్మించారు. ఎ మెమొరబుల్ లవ్ ట్యాగ్ లైన్‌తో టీనేజ్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 18న శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరో ఉదయ్ రాజ్ చిత్ర విశేషాలను పంచుకున్నారు.హీరో ఉదయ్ రాజ్ మాట్లాడుూ..'చిన్నప్పట్నుంచీ చిరంజీవిపై ఇష్టం ఉండేది. ఆయన స్ఫూర్తితో సినిమాల్లోకి వచ్చాను. తర్వాత ఆచార్య షూటింగ్ టైమ్‌లో ఆయనతో మాట్లాడటం గొప్ప అనుభవం. 12 ఏళ్లగా ఇండస్ట్రీలో ఉన్నా. చాలా సినిమాల్లో బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్ట్‌గా నటించాను. బంగార్రాజు సపోర్ట్‌తో మధురం చిత్రంలో హీరోగా చేశా. దర్శకుడు రాజేష్ చికిలేతో నాకు ఎప్పట్నుంచో పరిచయం ఉంది. ఆయన ఈ కథ చెప్పినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను. నైంటీస్ బ్యాక్‌డ్రాప్ స్టోరీ ఇది. పదవ తరగతి అమ్మాయి, తొమ్మిదో తరగతి అబ్బాయి మధ్య నడిచే ప్రేమకథ చాలా అందంగా ఉంటుంది. నేను చదువుకుంది జెడ్పీహెచ్ స్కూల్లోనే కావడంతో అప్పటి విశేషాలను గుర్తు చేసేలా ఈ చిత్రాన్ని రూపొందించాం. 90ల జనరేషన్‌కు పాత విషయాలను గుర్తుచేసేలా సినిమా ఉంటుంది. ఇందులో కథే హీరో అని భావిస్తారు' అని తెలిపారు.అంతేకాకుడా..'హీరోయిన్గా తెలుగమ్మాయిని తీసుకోవాలనుకున్నా.. కొన్ని ప్రయత్నాలు చేశాం కానీ కుదరలేదు. అయితే వైష్ణవి సింగ్ మాత్రం చాలా బాగా చేసింది. మధు, రామ్‌ల ప్రేమాయణమే ఈ మధురం చిత్రం. దర్శకుడు రాజేష్ చికిలే ఈ కథను చాలా అందంగా తీర్చిదిద్దారు. టీజర్, ట్రైలర్ చూసిన వాళ్లు చాలా బాగుందని కాంప్లిమెంట్ ఇవ్వడం చాలా ఆనందంగా అనిపించింది. ఈ సినిమా విషయంలో చాలా మంది నాకు సపోర్ట్‌గా నిలిచారు. హీరోనే కాకుండా ఎలాంటి పాత్రలు చేయడానికికైనా నేను సిద్ధంగా ఉంటాను' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో బస్ స్టాప్ ఫేం కోటేశ్వర రావు, కిట్టయ్య, ఎఫ్ ఎం బాబాయ్, దివ్య శ్రీ, సమ్యు రెడ్డి, జబర్దస్త్ ఐశ్వర్య, ఉష, అప్పు, రామ్ కీలక పాత్రలు పోషించారు. -
‘మధురం’ పోస్టర్ ప్రామిసింగ్‌గా ఉంది: విశ్వక్ సేన్
ఉదయ్, వైష్ణవి హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘మధురం’. శ్రీ వెంకటేశ్వర ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై బంగార్రాజు ఎం నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజేష్ చికిలే దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్ని మాస్ కా దాస్ విశ్వక్ సేన్ విడుదల చేసి టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ‘పోస్టర్ చూడటానికి చాలా ప్రామిసింగ్ గా ఉంది. నాకు కూడా ఈ మూవీ చూడాలని చాలా క్యూరియాసిటీ గా ఉంది’అని విశ్వక్ అన్నారు. అడగగానే పెద్దమనసుతో ఒప్పుకొని ఫస్ట్ లుక్ పోస్టర్ని విడుదల చేసిన విశ్వక్సేన్కు ఎప్పుడు రుణపడి ఉంటామని చిత్రబృందం పేర్కొంది.