
అన్న డబ్బులు ఇస్తారని వెలసిన ప్లెక్సీ
పుంగనూరు(చిత్తూరు జిల్లా): గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రూ.2వేల టోకెన్లు పంపిణీ చేసిన అప్పటి జనసేన అభ్యర్థి బి.రామచంద్ర యాదవ్‌ను ఉద్దేశించి బుధవారం పట్టణంలో ప్లెక్సీ లు వెలిశాయి. ప్రధాన కూడళ్లు, మార్గాల్లో ప్లెక్సీలు భారీగా కనిపించాయి.
చదవండి: తక్కువ సమయంలో అధిక ఆదాయం.. నెలకు లాభం ఎంతంటే?
అందులో రామచంద్రయాదవ్ అన్నా.. ఎన్నికలప్పుడు మీరిచ్చిన టోకన్లకు ఇప్పుడైనా డబ్బులు ఇవ్వండి అంటూ పేర్కొన్నారు. రామచంద్రయాదవ్ అన్నగారు.. ఎన్నికలలో ఇచ్చిన టోకెన్లకు కొత్తయిండ్లులోని తన నివాసం వద్ద 7వ తేదీన ఉదయం 10 గంటల నుంచి టోకెన్లు ఉన్న వారికి డబ్బులు ఇస్తున్నారు అంటూ మరికొన్ని ఫ్లెక్సీల్లో ఉంది. ఈ క్రమంలో టోకెన్లు తీసుకుని డబ్బులు ఇవ్వాలంటూ పెద్దసంఖ్యలో మహిళలు ఆందోళనకు దిగడం గమనార్హం.
టోకెన్లకు డబ్బు ఇవ్వాలని వెలసిన ప్లెక్సీ
Comments
Please login to add a commentAdd a comment