
సాక్షి, తిరుపతి: కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకున్నట్టుంది బీజేపీ–జనసేన పరిస్థితి. అంతా బాగుందని, కలిసికట్టుగా ముందుకెళ్తామని ఆయా పార్టీల నేతలు డప్పుకొట్టుకుంటూనే తెరవెనుక సహాయనిరాకరణకు పాల్పడడం, కక్షసాధింపులకు దిగడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.
నామినేషన్‌కు దూరం
తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ–జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రంగంలోకి దిగిన మాజీ ఐఏఎస్ రత్నప్రభ నామినేషన్ కార్యక్రమానికి జనసేన పూర్తిగా దూరమైంది. నెల్లూరు కలెక్టరేట్‌లో జరిగిన నామినేషన్ కార్యక్రమానికి జనసైనికులు హాజరు కాలేదు.
నాదెండ్ల తిరుపతిలోనే ఉన్నా
జనసేననేత, మాజీ ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ రెండు రోజులుగా తిరుపతిలోనే ఉన్నా రత్నప్రభ నామినేషన్ కార్యక్రమానికి హాజరుకాలేదు. దీనిపై బీజేపీ కన్నెర్రజేసినట్టు విశ్లేషకులు చెబుతున్నారు.
వివాదానికి కారణం ఏమిటంటే
తిరుపతి ఉప ఎన్నికల బరిలో ఎవరు ఉండాలనే అంశంపై బీజేపీ, జనసేన మధ్య వివాదం మొదలైంది. తెలంగాణలో ఎన్నికల త ర్వాత తిరుపతిలోనూ పోటీచేయాలని బీజేపీ ప్రకటించింది. జనసేనతో సంప్రదించకుండానే తమ అభ్యర్థిని ప్రకటించేసింది. ఏకపక్ష నిర్ణయంతో జనసేనకు కడుపుమండినట్టుంది. అందుకే సహాయనిరాకరణకు దిగింది.
పవన్ ప్లాన్ ఇదీ
వాస్తవానికి తిరుపతి బరిలో జనసేన ఉండాలని భావించింది. తిరుపతిలో తమ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ జనసేనకే పడుతాయని అంచనా వేసింది. కానీ ఆ పార్టీ నేతల ఆశలపై మద్దతుపార్టీ అయిన బీజేపీ నీళ్లు చల్లడంతో జీర్ణించుకోలేక పోతోంది. బీజేపీ ప్లాన్ బీ అమలు ఒక సామాజికవర్గం నాయకులు దూరంగా ఉన్నారని పసిగట్టిన బీజేపీ నేతలు ప్లాన్ బీ అమలు చేశారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో బీజేపీ, జనసేన ఉమ్మడి సీఎం అభ్యర్థి పవన్‌కళ్యాణేనంటూ ప్రకటించేసింది.
చదవండి: టీడీపీ ఆవిర్భావ దినోత్సవం జరిపే అర్హత బాబుకు లేదు
Comments
Please login to add a commentAdd a comment