కొండపల్లి(ఇబ్రహీంపట్నం): ‘నేను నిరుపేదను. ఎలాంటి స్థిరాస్తులు లేవు. రోజువారీ కూలీ అయిన నేను కుటుంబ అవసరాలు తీర్చలేకపోవడంతో పాటు పిల్లల చదువుల కోసం ఎంతో ఇబ్బందులు పడుతుండేవాడిని. ఇలాంటి నా జీవితంలో సంక్షేమ పథకాలతో వెలుగులు నింపారు. సగర్వంగా తలెత్తుకుని జీవించేలా చేశారు. ఆర్థికంగా చితికిపోకుండా జీవితంపై ఆశలు చిగురింప చేసిన జగనన్నా ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలి.
మా కుటుంబం మొత్తం మీ వెనుక నడుస్తాం’ అంటూ ఓ నిరుపేద తన అభిమానాన్ని ఫ్లెక్సీ రూపంలో తెలిపాడు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లికి చెందిన ఎస్‌ఎన్ మీరా (సుభానీ) కుటుంబం కూలి పనులు చేసుకుని జీవిస్తుంటుంది. అన్నింటికీ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న సమయంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ంది.
అతనికి పలు పథకాల ద్వారా లబ్ధి అందించింది. దీంతో అతను దీన స్థితి నుంచి బయటపడి సగౌరవంగా జీవిస్తున్నాడు. తన కుటుంబానికి ప్రభుత్వం ఏమి లబ్ధి చేకూర్చిందో ఫ్లెక్సీ వేసి తన ఇంటి గోడకి అతికించాడు. ‘మీ ఉప్పు తింటున్నాం.. మీకు విశ్వాసంగా ఉంటాం’ అంటూ ప్లెక్సీ వేయించి సీఎం జగన్‌కు, స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఫ్లెక్సీలో ఇలా రాశాడు..
♦ వైఎస్సార్ చేయూత పథకంలో వచ్చి న రూ. 56,250తో నా భార్య జక్రియా బేగం కిరాణా షాపు ఏర్పాటు చేసుకుంది.
♦ డ్వాక్రా రుణమాఫీతో రూ.36 వేలు లబ్ధి.
♦ కుమార్తె ఫాతిమా జేఎన్టీయూలో ఎంటెక్ చదువుకు వసతి దీవెన కింద రూ.40 వేలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రూ.30వేలు, కుమారుడు బీకాం కంప్యూటర్స్ చదువుకు రూ.45 వేలు ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన కింద రూ.30 వేలు, మరో కుమార్తె నబీనా ఎమ్మెస్సీ బీఈడీ చదువుకు ఫీజు రూ. 30 వేల లబ్ధి చేకూరింది.
Comments
Please login to add a commentAdd a comment