Subhani
-
ఈ పేద జీవితంలో ఆశలు చిగురించాయి
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): ‘నేను నిరుపేదను. ఎలాంటి స్థిరాస్తులు లేవు. రోజువారీ కూలీ అయిన నేను కుటుంబ అవసరాలు తీర్చలేకపోవడంతో పాటు పిల్లల చదువుల కోసం ఎంతో ఇబ్బందులు పడుతుండేవాడిని. ఇలాంటి నా జీవితంలో సంక్షేమ పథకాలతో వెలుగులు నింపారు. సగర్వంగా తలెత్తుకుని జీవించేలా చేశారు. ఆర్థికంగా చితికిపోకుండా జీవితంపై ఆశలు చిగురింప చేసిన జగనన్నా ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలి. మా కుటుంబం మొత్తం మీ వెనుక నడుస్తాం’ అంటూ ఓ నిరుపేద తన అభిమానాన్ని ఫ్లెక్సీ రూపంలో తెలిపాడు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లికి చెందిన ఎస్ఎన్ మీరా (సుభానీ) కుటుంబం కూలి పనులు చేసుకుని జీవిస్తుంటుంది. అన్నింటికీ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న సమయంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ంది. అతనికి పలు పథకాల ద్వారా లబ్ధి అందించింది. దీంతో అతను దీన స్థితి నుంచి బయటపడి సగౌరవంగా జీవిస్తున్నాడు. తన కుటుంబానికి ప్రభుత్వం ఏమి లబ్ధి చేకూర్చిందో ఫ్లెక్సీ వేసి తన ఇంటి గోడకి అతికించాడు. ‘మీ ఉప్పు తింటున్నాం.. మీకు విశ్వాసంగా ఉంటాం’ అంటూ ప్లెక్సీ వేయించి సీఎం జగన్‌కు, స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఫ్లెక్సీలో ఇలా రాశాడు.. ♦ వైఎస్సార్ చేయూత పథకంలో వచ్చి న రూ. 56,250తో నా భార్య జక్రియా బేగం కిరాణా షాపు ఏర్పాటు చేసుకుంది. ♦ డ్వాక్రా రుణమాఫీతో రూ.36 వేలు లబ్ధి. ♦ కుమార్తె ఫాతిమా జేఎన్టీయూలో ఎంటెక్ చదువుకు వసతి దీవెన కింద రూ.40 వేలు, ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.30వేలు, కుమారుడు బీకాం కంప్యూటర్స్ చదువుకు రూ.45 వేలు ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన కింద రూ.30 వేలు, మరో కుమార్తె నబీనా ఎమ్మెస్సీ బీఈడీ చదువుకు ఫీజు రూ. 30 వేల లబ్ధి చేకూరింది. -
శభాష్.. సుభానీ సోలార్ స్ప్రేయర్!
కషాయాలు, ద్రావణాలు, జీవామృతం, అటవీ చైతన్యం, అమృత్‌పానీ వంటి భూసార వర్ధని ద్రావణాల నుంచి పురుగుమందుల వరకు పంటలపై మనుషులు పిచికారీ చేయడం రైతుకు భారంగా మారింది. కూలీల కొరత, అధిక ఖర్చు సమస్యలతో పాటు సకాలంలో ప్రారంభించి, త్వరగా పిచికారీ పూర్తి చేయడం కూడా రైతుకు అనుకూలించే ముఖ్య విషయాలు. రైతుకు ఖర్చును, శ్రమను, సమయాన్ని ఆదా చేసే బూమ్ స్ప్రేయర్లు సహా కొత్త రకం స్ప్రేయర్లను రూపొందించడంలో సయ్యద్ సుభానీ సిద్ధహస్తుడు. సౌరశక్తితో తనంతట తానే నడుస్తూ, పిచికారీ చేసే సోలార్ స్ప్రేయర్‌ను తాజాగా సుభానీ ఆవిష్కరించారు. మెట్ట, ఆరుతడి పంటలన్నిటికీ ఇది ఉపయోగపడుతుంది. ప్రయోగాలే ఊపిరిగా సరికొత్త స్ప్రేయర్లను రూపొందిస్తూ అన్నదాతల మన్ననలు పొందుతున్న ప్రసిద్ధ గ్రామీణ ఆవిష్కర్త సయ్యద్ సుభానీ తాజాగా సౌర శక్తితో నడిచే ‘బ్యాటరీ రన్ సోలార్ స్ప్రేయర్’ను రూపొందించారు. మెకానిక్ అయిన సుభానీ గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలంలోని మారుమూల గ్రామం నాగబైరువారిపాలెం వాస్తవ్యుడు. ఆరేళ్ల క్రితం నుంచి కొత్త డిజైన్లతో స్ప్రేయర్లు తయారు చేస్తున్నారు. జీపు, ట్రాక్టర్లతో నడిచే బూమ్ స్ప్రేయర్లతో పాటు మొత్తం 9 స్ప్రేయర్లను తయారు చేసి ప్రసిద్ధి పొందారు. ఈ మూడు చక్రాల సోలార్ స్ప్రేయర్‌కు డీజిల్/పెట్రోలు అవసరం లేదు. దీని పైన ఏర్పాటు చేసిన సౌర ఫలకం ద్వారా తయారు చేసుకునే సౌరశక్తితో బ్యాటరీ చార్జి అవుతుంది. ఆ శక్తితోనే నడుస్తుంది, పిచికారీ చేస్తుంది. దీని వెనుక మనిషి ఉండాలి. అయితే, శ్రమపడాల్సిన అవసరం లేదు. ట్యాంకును నింపి, సాలులో దీన్ని నిలిపి ఆన్ చేస్తే చాలు. అదే తనను తాను నడుపుకుంటూ పిచికారీ చేస్తూ ముందుకు వెళ్తుంది. స్ప్రేయర్ చక్రాలకు మట్టి పెళ్లలు అడ్డుపడినప్పుడో, మలుపు తిరగాల్సినప్పుడో మనిషి అవసరం ఉంటుంది. ఏయే పంటలకు ఉపయోగం? 9 అంగుళాల నుంచి 42 అంగుళాల అచ్చు వాడే శనగ, మినుము వంటి అపరాలు, పత్తి, పొగాకు, కూరగాయ పంటలు తదితర మెట్ట, ఆరుతడి పైరులన్నిటిలోనూ కషాయాలు, ద్రావణాలు, పురుగుమందుల పిచికారీకి ఇది సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. జీవామృతం పిచికారీ చేయాలంటే.. డబుల్ ఫిల్టర్‌ను వాడాలి. పెద్ద నాజిల్ పెట్టుకోవాలని సుభానీ తెలిపారు. పందిరి కూరగాయ తోటల్లో పందిళ్ల పైన పిచికారీ చేయడానికి కూడా దీని డిజైన్‌లో కొన్ని మార్పులు చేసి తయారు చేస్తానని సుభానీ తెలిపారు. ఈ స్ప్రేయర్ చక్రాల మధ్య 18 అంగుళాల దూరం ఉంటుంది. ఇటు 6 అడుగులు, అటు 6 అడుగుల దూరం పిచికారీ చేస్తుంది. అవసరాన్ని బట్టి తగినట్లు మార్పులు చేసుకోవచ్చని సుభానీ తెలిపారు. అర గంటలో ఎకరం పిచికారీ స్ప్రేయర్ తయారీకి రూ. 32 వేల ఖర్చు ఈ మూడు చక్రాల సోలార్ స్ప్రేయర్ తయారీకి సుమారు రూ. 32 వేలు ఖర్చవుతుందని సుభానీ తెలిపారు. సైకిల్‌కి వాడే మూడు చక్రాల బండికి 50 వాట్ల సోలార్ ప్యానల్, 12 యామ్స్ బ్యాటరీ. 12 వోల్టుల (120 పీఎస్) మోటారు, 22 లీటర్ల సామర్థ్యం వాటర్ ట్యాంక్‌ను అమర్చారు. నాలుగు నాజిల్స్ ఏర్పాటు చేశారు. ఎకరా పొలంలో 30 నిమిషాల్లో పురుగుమందు పిచికారీ చేయవచ్చు. కూలీలను పెట్టుకొని పిచికారీ చేయాలంటే గంటన్నర సమయం పడుతుంది. దీని బ్యాటరీకి ఏడాది గ్యారంటీ ఉంది. మనిషి నెట్టుకుంటూ వెళ్లే విధంగా ఒకే చక్రంతో కూడిన సోలార్ స్ప్రేయర్‌ను రూ. 22 వేలకే రూపొందించవచ్చన్నారు. సుభానీని గ్రాంటు ఇవ్వడం ద్వారా నాబార్డు ప్రోత్సహిస్తుండడం విశేషం. బ్యాంకు రుణం ఇస్తే మరిన్ని రూపొందిస్తా! నేను గత ఆరు సంవత్సరాలుగా కొత్తరకం స్ప్రేయర్లపై ప్రయోగాలలో నిమగ్నమై ఉన్నాను. ఇప్పటికి 9 రూపొందించాను. ఈ సోలార్ స్ప్రేయర్ లాంటిది దేశంలో ఇంతకుముందెవరూ తయారు చేయలేదు. నా భార్య షకీలా, తమ్ముడు చిన్న సుభానీ, కుమారులు ఖుధావ, మోషిన్, కుమార్తె షాహిన్తోపాటు నాబార్డు, పల్లెసృజన సంస్థలు అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిది. బ్యాంకు రుణ సౌకర్యం కల్పిస్తే, రైతులకు తోడ్పడే మరిన్ని నూతన పరికరాలు రూపొందిస్తా. – సయ్యద్ సుభానీ (98486 13687), గ్రామీణ ఆవిష్కర్త, నాగబైరువారిపాలెం, పెదనందిపాడు మం., గుంటూరు జిల్లా స్ప్రేయర్‌కు తుది మెరుగులు దిద్దుతున్న సుభానీ – ఓబుల్‌రెడ్డి వెంకట్రామిరెడ్డి, సాక్షి, అమరావతి బ్యూరో ఫొటోలు: పులి ప్రకాశ్, సాక్షి, పెదనందిపాడు -
సుభాని మృతదేహం లభ్యం
సత్తుపల్లి: సత్తుపల్లి పట్టణానికి చెందిన నాటు కోళ్ల వ్యాపారి ఎస్కె. మహబూబ్ సుభాని(35) మృతదేహం శనివారం మండలంలోని రుద్రాక్షపల్లి శివారులో లభ్యమైంది. డాగ్‌స్క్వాడ్ సాయంతో అతడి శవాన్ని పోలీసులు గుర్తించారు. ఎస్కె. మహబూబ్ సుభాని బుధవారం సాయంత్రం నాటుకోళ్ల కోసం ఎప్పటిలాగే వెళ్లాడు. రెండురోజులు గడిచినా సుభాని ఇంటికి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు సత్తుపల్లి పోలీస్‌స్టేషన్‌లో గురువారం రాత్రి ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లి శివారులో చినడొంక దారిలో రక్తపు మరకలు, చొక్కా గుండీలు, చెప్పులు, హెల్మెట్, సెల్ కవర్, పర్సు, కాంటా రాళ్లు కన్పించటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. మిస్సింగ్ అయిన సుభానికి సంబంధించిన వస్తువులుగా మామయ్య బాజీ గుర్తించారు. ఆ పరిసర ప్రాంతాలలో బంధువులు, పోలీసులు గాలింపు చేపట్టినా ఆచూకీ లభించలేదు. డాగ్‌స్క్వాడ్ ప్రవేశంతో.. మహబూబాబాద్ జిల్లాకు చెందిన డాగ్‌స్క్వాడ్ బృందాన్ని సత్తుపల్లి ఎస్సై నరేష్‌బాబు శనివారం ఉదయం రుద్రాక్షపల్లిలోని చిన్నడొంక ప్రదేశంలోని రక్తపు మరకలు ఉన్న వద్దకు తీసుకెళ్లారు. మహబూబ్ సుభాని చెప్పులు, వస్తువులను వాసన చూపించటంతో డాగ్‌స్క్వాడ్ సుమారు 200 మీటర్ల దూరంలోని కల్వర్టు వద్దకు వెళ్లి ఆగిపోయింది. చుట్టు పక్కల అంతా వరిపొలాల్లో నీళ్లు ఉండటంతో కొద్దిసేపు డాగ్‌స్క్వాడ్ అక్కడక్కడే తిరుగుతుండటంతో పోలీసులు సమీపంలోని వరి పొలాలను క్షుణ్ణంగా పరిశీలించే క్రమంలో దుర్వాసన వెదజల్లింది. అనుమానం వచ్చి వరిదుబ్బలను తొలగిస్తుండగా మహబూబ్ సుభాని మృతదేహం కన్పించింది. మూడురోజులు కావటంతో మృతదేహం బాగా ఉబ్బిపోయి చర్మం ఊడిపోయింది. అక్కడే ప్రభుత్వ వైద్యులు నర్సింహారావును పిలిపించి పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. నాటుకోళ్ల లావాదేవీలే.. రుద్రాక్షపల్లి గ్రామానికి చెందిన ఓ నాటుకోళ్లు దొంగతో మహబూబ్ సుభానికి వ్యాపార లావాదేవీలు ఉన్నట్లు సమాచారం. జనవరి నెలలో బుగ్గపాడు, రుద్రాక్షపల్లి పరిసర ప్రాంతాల్లో పందెం కోళ్లు పెద్ద ఎత్తున దొంగలించబడ్డాయి. ఇటీవలే ఆ యువకుడు తన సొంత ద్విచక్ర వాహనం రూ.8 వేలకు తాకట్టు పెట్టి జూదం ఆడి డబ్బులు పోగొట్టుకున్నట్లు తెలిసింది. డబ్బుల కోసం ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో మహబూబ్ సుభాని మృతి చెందినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనలో ఇంకా ఎంతమంది ఉన్నారో తెలుసుకునేందుకు పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సత్తుపల్లి పట్టణ సీఐ ఎం.వెంకటనర్సయ్య కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
వైఎస్సార్సీపీలోకి చేరిన సుభానీ
-
జాతరకు వెళ్లిన యువకుడు శవమై తేలాడు
గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామానికి చెందిన సుభాని(22) అనే యువకుడు రెండు రోజుల క్రితం అదృశ్యమై సోమవారం ఉదయం బావిలో శవమై తేలాడు. సుభాని రెండురోజుల క్రితం పొరుగూరిలో జరుగుతున్న జాతరకు వెళ్లాడు. అప్పటి నుంచి అతని జాడలేదు. సోమవారం ఉదయం వెల్లటూరు గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో శవమే తేలాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి బయలుదేరారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ: వ్యక్తి మృతి
బెల్లంపల్లి: గుంటూరు జిల్లా బెల్లంపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో లారీ అదుపు తప్పి రోడ్డు పక్కనున్న ఇంట్లోకి దూసుకుపోయింది. దీంతో ఇంటి ముందు నిద్రిస్తున్న వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం ఉదయం జరిగింది. సుబాని(58) అనే వ్యక్తి ఇంటి ముందు నిద్రిస్తుండగా వేగంగా వచ్చిన లారీ అదుపు తప్పి సుభానీని ఢీకొట్టి ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సుభాని అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
మాయ‘లేడీ’ అరెస్టు
సహకరించిన మరో ఇద్దరు కూడా.. విజయవాడ సిటీ : అమాయకులను వలలో వేసుకొని నగదు, నగలు దొంగిలించి ఉడాయించే మాయ‘లేడి’తోపాటు ఆమెకు సహకరిస్తున్న ఇద్దరు వ్యక్తులను శనివారం సీసీఎస్ పోలీసులు అరెస్టుచేశారు. వారి నుంచి 14 గ్రాముల బంగారం, రూ.500 నగదు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన వల్లభనేని వెంకట రమణ అలియాస్ రమ్య(28) ఆరేళ్ల కిందట భర్తతో విడిపోయి తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ఆమె ఇద్దరు పిల్లలు రామవరప్పాడులోని మిషన్ పాఠశాలలో చదువుతున్నారు. కొద్ది రోజుల క్రితం గుంటూరు నుంచి విజయవాడ వస్తుండగా తెనాలికి చెందిన ఓ వ్యక్తితో పరిచయం పెంచుకొని వివాహేతర సంబంధం సాగిస్తోంది. ఈ క్రమంలో అతని వద్ద బంగారం, డబ్బు దోచుకోవాలనే ఉద్దేశంతో తన మేనమామ కుమారుడైన లంకే వెంకట నాగాంజనేయులు(23), దూరపు బంధువైన కొప్పనాతి సుభానీ(20)తో కలిసి పథకం రచించింది. గత నెల 26వ తేదీన తనతో వివాహేతర సంబంధం సాగించే తెనాలికి చెందిన వ్యక్తిని విజయవాడ తీసుకొచ్చింది. రాత్రికి కృష్ణానది ఇసుకతిన్నెల వద్దకు తీసుకెళ్లింది. పథకం ప్రకారం నాగాంజనేయులు, సుభానీ పోలీసులమంటూ వచ్చి అతడ్ని బెదిరించి బంగారు గొలుసు, నగదు, సెల్‌ఫోన్ తీసుకొని ఉడాయించారు. బాధితుని ఫిర్యాదు మేరకు కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన సీసీఎస్ పోలీసులు నిందితులను అరెస్ట్‌చేశారు. మహిళా దొంగ అరెస్టు నగరంలోని రద్దీ ప్రాంతాల్లో మహిళల బ్యాగులు, పర్సులు దొంగిలించే గుంటూరు జిల్లా సీతానగరానికి చెందిన బొజ్జగాని మరియమ్మను కూడా సీసీఎస్ పోలీసులు అరెస్ట్‌చేశారు. ఆమె నుంచి రూ.19వేల నగదు, కాసు బరువైన బంగారు చెవి దిద్దులను స్వాధీనం చేసుకున్నారు.