ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ: వ్యక్తి మృతి
బెల్లంపల్లి: గుంటూరు జిల్లా బెల్లంపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో లారీ అదుపు తప్పి రోడ్డు పక్కనున్న ఇంట్లోకి దూసుకుపోయింది. దీంతో ఇంటి ముందు నిద్రిస్తున్న వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం ఉదయం జరిగింది. సుబాని(58) అనే వ్యక్తి ఇంటి ముందు నిద్రిస్తుండగా వేగంగా వచ్చిన లారీ అదుపు తప్పి సుభానీని ఢీకొట్టి ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సుభాని అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.