గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామానికి చెందిన సుభాని(22) అనే యువకుడు రెండు రోజుల క్రితం అదృశ్యమై సోమవారం ఉదయం బావిలో శవమై తేలాడు. సుభాని రెండురోజుల క్రితం పొరుగూరిలో జరుగుతున్న జాతరకు వెళ్లాడు. అప్పటి నుంచి అతని జాడలేదు. సోమవారం ఉదయం వెల్లటూరు గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో శవమే తేలాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి బయలుదేరారు.
జాతరకు వెళ్లిన యువకుడు శవమై తేలాడు
Published Mon, Jul 4 2016 9:32 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
Advertisement
Advertisement