నూజెండ్ల: అంగన్వాడి టీచర్‌గా పనిచేస్తున్న వివాహిత అనుమానాస్ప స్థితిలో మృతిచెందింది. ఈ సంఘటన గుంటూరు జిల్లా నూజెండ్ల మండలం థాన అన్నవరం గ్రామంలో శనివారం వెలుగు చూసింది. వివరాలు.. గ్రామానికి చెందిన స్వప్న(35) అంగన్ వాడి టీచర్‌గా పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ రోజు ఉదయం ఇంట్లో ఉరేసుకొని మృతి చెందింది.
ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్నపోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. కాగా..మృతురాలి వంటిపై గాయాలు ఉండటంతో పాటు.. ఇంట్లో అక్కడక్కడ రక్తపు మరకలు ఉన్నాయని స్థానికులు అంటున్నారు. మృతురాలికి భర్త , ఇద్దరు పిల్లలు ఉన్నారు.